లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ అవ్వడం లేదా ..?

లక్ష్మీస్ ఎన్టీఆర్ .. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సంచలనం సృష్టించేందుకు వస్తున్న సినిమా. వివాదాస్పదమైన అంశం ఏదైనా ఉంటే దాన్నే కధనం కింద మార్చుకుని సినిమాగా తీసి మరింత వివాదాస్పదం చేయడం వర్మ మార్క్ స్పెషలిటీ.
ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ను ఈ నెల 22 న విడుదల చేసేందుకు వర్మ ప్లాన్ చేసాడు. అయితే ఇప్పుడు ఆ సినిమా ఏపీలో ఎన్నికలు అయ్యేవరకు వాయిదాపడే అవకాశం కనిపిస్తోంది.

ఈ సినిమా కథనం గురించి వర్మ ఏం చెప్తున్నాడు అంటే …ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతి ప్రవేశించాక నందమూరి కుటుంబంలో కల్లోలం గురించి చూపిస్తున్నా అంటున్నాడు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ సినిమా విడుదలను ఆపాలని ఫిర్యాదు అందింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన దేవీబాబు చౌదరి ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్లో జరగనున్న ఎన్నికలపై ప్రభావం చూపించేలా ఉందని తక్షణం ఈ సినిమా రిలీజ్ అవ్వకుండా ఆపేలా చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఆ ఫిర్యాదు కారణంగా ఈ నెల 22న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. సినిమాలో సీఎం చంద్రబాబు పాత్రను నెగిటివ్ గా చూపించారని, ఈ చిత్రం ఓటర్లపై ప్రభావం చూపుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 11 వరకు ఈ చిత్రం విడుదలను ఆపేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ ఫిర్యాదు కాపీని స్వీకరించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పరిశీలన కోసం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి పంపారని తెలుస్తోంది.

Leave a comment