చిరంజీవితో కొరటాల శివ సినిమా లేటెస్ట్ అప్డేట్..!

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా నరసిం హా రెడ్డి ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఈ ఇయర్ దసరాకి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. రాం చరణ్ నిర్మాతగా 200 కోట్లపైగా బడ్జెట్ తో వస్తున్న సైరా నరసిం హా రెడ్డి తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని తెలిసిందే. ఆ సినిమాకు సంబందించి డీటైల్స్ వచ్చేశాయి.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టిన ఈ సినిమా జూన్ నుండి సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది. కొరటాల శివ అద్భుతమైన కథ రాసుకున్నాడని తెలుస్తుంది. తన ప్రతి సినిమాలో సోషల్ మెసేజ్ ఉండేలా చూసుకుంటున్న కొరటాల శివ ఈ సినిమాలో కూడా రైతులకు సంబందించిన అంశాన్ని ప్రస్థావిస్తున్నారని తెలుస్తుంది. సినిమాలో మెగాస్టార్ డ్యుయల్ రోల్ చేస్తారట. కొణిదెల ప్రొడక్షన్స్ లో రాం చరణ్ ఈ సినిమాను నిర్మిస్తారని తెలుస్తుంది.

మహేష్ తో రెండు హిట్లు, ఎన్.టి.ఆర్, ప్రభాస్ లతో ఒక్కో హిట్టు కొట్టిన కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి సినిమాతో మరో సూపర్ డూపర్ హిట్ సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. స్క్రిప్ట్ బాగా రావడంతో సినిమాపై ఫుల్ కాన్ ఫిడెంట్ గా ఉన్నాడట. మరి ఈ మెగా మూవీ మెగా ఫ్యాన్స్ కు ఎలాంటి సంబరాన్ని తెస్తుందో చూడాలి.

Leave a comment