ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొడుతున్న మజిలీ.. అంతా సమంత మాయ..!

అక్కినేని నాగ చైతన్య, సమంత పెళ్లి తర్వాత కలిసి చేస్తున్న మొదటి సినిమా మజిలీ. శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. నిన్ను కోరి సినిమాతో సత్తా చాటిన శివ ఈసారి కూడా డిఫరెంట్ లవ్ స్టోరీతో వస్తున్నాడు. చైతు, సమంతలతో పాటుగా ఈ సినిమాలో దివ్యాన్ష కౌషిక్ కూడా నటిస్తుంది. సన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా బిజినెస్ లో కూడా అదరగొడుతుందని తెలుస్తుంది.

మజిలీ శాటిలైట్ రైట్స్ 5 కోట్లకు జెమిని టివి కొనేయగా.. డిజిటల్ రైట్స్ అమేజాన్ ప్రైమ్ వారు 3.5 కోట్లకు కొన్నారట. ఇక హింది డబ్బింగ్ రైట్స్ మరో 4 కోట్ల దాకా పలికాయని తెలుస్తుంది. అంటే థియేట్రికల్ రైట్స్ కాకుండానే మజిలీ బిజినెస్ 12 కోట్ల దాకా జరిగింది. ఎలా చూసినా సరే ఇది సేఫ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. అయితే అసలేమాత్రం ఫాంలో లేని నాగ చైతన్య సినిమాకు ఈ రేంజ్ లో బిజినెస్ ఎలా జరుగుతుంది అంటే అది కేవలం సమంత చేస్తున్న మాయే అని అర్ధమవుతుంది.

చైతు, సమంత తెర మీద చేసే మ్యాజిక్ ఎలా ఉంటుందో అందరికి తెలుసు. పెళ్లి తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా కాబట్టి మజిలీ మీద ఆసక్తి పెరిగింది. ఇక ఈమధ్యనే రిలీజైన టీజర్ కూడా ఇంప్రెస్ చేయడంతో సినిమా కచ్చితంగా వర్క్ అవుట్ అవుతుందని అంటున్నారు. మరి మజిలీ చేసే హంగామా ఎలా ఉంటుందో చూడాలి.

Leave a comment