నిర్మాతగా చుక్కలు చూపిస్తున్న రాం చరణ్..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిర్మాతగా మారి చేసిన మొదటి ప్రయత్నం ఖైది నంబర్ 150. పదేళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాగా ఈ సినిమా అదిరిపోయే హిట్ అందుకుంది. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మాతగా మొదటి హిట్ కొట్టాడు. ఇక ఈ ప్రొడక్షన్ లో వస్తున్న రెండో సినిమా సైరా నరసిం హా రెడ్డి. ఉయ్యాలవాడ నరసిం హా రెడ్డి జీవిత కథతో వస్తున్న ఈ సినిమా దసరాకి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట.

ఇక ఈ సినిమా బిజినెస్ విషయంలో చరణ్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడట. సైరా కోసం 200 కోట్ల బడ్జెట్ పెట్టేస్తున్న రాం చరణ్ ఈ సినిమా బిజినెస్ విషయంలో అసలేమాత్రం తగ్గట్లేదట. అందుకే డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ రేటు చెబుతున్నాడట. యూఎస్ లో ఈ సినిమా బిజినెస్ 4 మిలియన్ డాలర్స్ చెబుతున్నాడట. అయితే దానికి అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ కొంత కంగారు పడుతున్నారు. చరణ్ మాత్రం ఇది మరో బాహుబలి అవుతుందన్నట్టుగా చెబుతున్నాడట.

సురేందర్ రెడ్డి మంచి దర్శకుడే కాని రాజమౌళిలా ప్రేక్షకులను మెప్పించే సత్తా ఉన్నవాడు అయితే కాదు. అతని కెరియర్ లో ఫ్లాపులున్నాయి. అయితే సైరా కథ వేరు.. లాస్ట్ ఇయర్ రిలీజైన సినిమా టీజర్ అంచనాలు పెంచేసింది. కచ్చితంగా ఈ సినిమా అంచనాలను అందుకుంటే మాత్రం మరోసారి చిరు తన సత్తా చాటినవాడవుతాడు. సినిమాలో అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు వంటి స్టార్స్ ఉన్నారు. తెలుగు, తమిళ, హింది భాషల్లో సైరా రిలీజ్ అవుతుంది.

Leave a comment