దుమ్మురేపుతున్న ‘అర్జున్ సురవరం’ టీజర్

హ్యాపీ డేస్ సినిమాతో నలుగు హీరోల్లో ఒకడిగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ తర్వాత సోలో హీరోగా పలు సినిమాల్లో నటించాడు. స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడ లాంటి సినిమాల వరుస హిట్ అందుకున్నాయి. దాంతో మనోడి మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం నిఖిల్ ‘అర్జున్ సురవరం’ సినిమాలో నటిస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమా టైటిల్ ముద్ర. కానీ ఇదే టైటిల్ లో ఇటీవల జగపతి బాబు నటించిన సినిమా రావడంతో పలు వివాదాలు జరిగాయి. మొత్తానికి నిఖిల్ తన టైటిల్ విషయంలో కాంప్రమైజ్ కావడం కొత్త టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి ‘శివరాత్రి’ సందర్భంగా ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. ‘ఒక అబద్ధాన్ని నిజం చేయడం చాలా ఈజీ .. కానీ ఒక నిజాన్ని నిజమని ప్రూవ్ చేయడం చాలా కష్టం”. “వెతికేవాడు దొరకట్లేదు .. వెతకాల్సినవాడు తెలియట్లేదు’ వంటి డైలాగ్స్ బాగున్నాయి. ఒక న్యూస్ రిపోర్టర్ గా నిఖిల్ నటన ఆకట్టుకునేలా వుంది. ఈ సినిమాలో పవర్ ఫుల్ జర్నలిస్ట్ పాత్రలో నిఖిల్ నటిస్తున్నట్టు కనిపిస్తుంది.

ఒక కేసు మిస్టరీ ఛేందించేందుకు విలన్స్ తో ఢీకొట్టే పాత్రలో కనిపిస్తున్నాడు. రాజ్ కుమార్ .. వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమాను, మార్చి 29వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ సినిమా నిఖిల్ .. లావణ్య త్రిపాఠికి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.

Leave a comment