గంగూలితో ఎఫైర్ పై స్పందించిన నగ్మా.?

టీం ఇండియా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలి అప్పటి స్టార్ హీరోయిన్ ప్రేక్షకుల హృదయాల్లో హాట్ ఇమేజ్ సంపాదించుకున్న నగ్మాల ప్రేమాయణం అప్పట్లో హాట్ న్యూస్ అయ్యింది. అప్పట్లో ఈ ఇద్దరి లవ్ ఎఫైర్ గురించి అంతటా హాట్ డిస్కషన్స్ నడిచాయి. వీరి రిలేషన్ మీద అప్పుడు నోరు విప్పని నగ్మా లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆ సీక్రెట్ బట్టబయలు చేసింది. సౌరవ్ తో లవ్ ఎఫైర్ నడిపించిన మాట వాస్తవమేనని ఒప్పుకున్న నగ్మా అప్పటికి ఆయనకు పెళ్లైందని ఆలోచించలేదని చెప్పింది.

అయితే తన ప్రేమ వల్ల అతని కెరియర్ పాడవుతుందనే ఆలోచనతో పెళ్లి దాకా వెళ్లిన తమ రిలేషన్ కు బ్రేక్ పడిందని చెప్పింది నగ్మా. అప్పట్లో గంగూలి ఫాం కోల్పోడానికి నగ్మా ఎఫైరే కారణమని వార్తలు బాగా వచ్చాయి. నగ్మాని దూరం పెట్టాక మళ్లీ గంగూలి తిరిగి ఫాం లోకి వచ్చాడట. హీరోయిన్ గా, రాజకీవ వేత్తగా నగ్మా మంచి కెరియర్ సాగించారు. ప్రస్తుతం సినిమల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న నగ్మా తెలుగులో త్రివిక్రం, అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది.

సినిమాలో అల్లు అర్జున్ మదర్ రోల్ లో నగ్మా నటిస్తుందని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం 50 ఏళ్లకు దగ్గర పడుతున్న ఈ టైంలో ఇప్పుడు పెళ్లికి సిద్ధమని చెబుతుంది నగ్మా. మచి వ్యక్తి దొరికితే ఇప్పటికి పెళ్లికి రెడీ అంటుంది అమ్మడు. మరి నగ్మా వెతికే మంచి వ్యక్తి ఆమెకు తారస పడతాడో లేదో చూడాలి.

Leave a comment