పాకిస్తాన్ పై కంగనా వివాస్పద వ్యాఖ్యలు.?

పుల్వామా దాడిలో భారత సైనికులు నలభై మంది అమరులైన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రతీకారంగా భారత నౌకాదళం పాక్ ఆక్రమిత ప్రాంతంలోకి చొరబడి 300 మంది పాక్ ఉగ్రవాదులను హతమార్చింది. దాంతో రగిలిపోయిన పాకిస్థాన్ భారత్ భూమిలోకి వాయుసేనను పంపించింది. కానీ భారతీయ వైమానిక దళం వాటిని తిప్పి కొట్టింది. ఈ క్రమంలోనే భారత వైమానిక కమాండర్ అభినందన్ పాక్ సైన్యానికి చిక్కాడు.

అయితే భారత్ చేపట్టిన శాంతి దౌత్యం..ప్రపంచ దేశాల వత్తిడితో పాక్ తలొగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. అభినందన్ ని విడుదల చేస్తున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాక్ పార్లమెంట్ లో ప్రకటించారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కంగ‌న ర‌నౌత్ పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగింది. పాకిస్థాన్‌లాంటి దేశాన్ని పూర్తిగా అంతం చెయ్యాల‌ని తాజాగా జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో కంగ‌న ఆగ్రహం వ్యక్తం చేసింది. గ‌త కొన్ని శ‌తాబ్దాల‌లో ఇలాంటి దాడి జ‌రిగి ఉండ‌దు.

ఆ దాడి గురించి తెలిసిన వెంట‌నే తీవ్ర ఆవేద‌న‌కు గుర‌య్యాను. వెంట‌నే స‌రిహ‌ద్దుకు వెళ్లిపోయి ఉగ్ర‌వాదుల‌ను కాల్చి చంపెయ్యాల‌నేంత కోపం వ‌చ్చింది. నాకే కాదు ప్రతి భారతీయుడుకి అదేవిధమైన కోపం వచ్చి ఉంటుంది. కేవ‌లం పాకిస్థాన్ న‌టుల‌ను బాలీవుడ్ నుంచి బ్యాన్ చేస్తే స‌రిపోదు. పాకిస్థాన్‌ను పూర్తిగా అంతం చేసెయ్యాలని ఆవేశంగా మాట్లాడింది.

Leave a comment