Gossipsమహానాయకుడు మరి ఇంత దారుణమా..!

మహానాయకుడు మరి ఇంత దారుణమా..!

ఎన్.టి.ఆర్ బయోపిక్ గా ప్రతిష్టాత్మకంగా బాలకృష్ణ నిర్మాణ సారధ్యంలో ఆయన ప్రధాన పాత్రలో రెండు పార్టులుగా ఈ సినిమా వచ్చింది. క్రిష్ డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ కథానాయకుడు, ఎన్.టి.ఆర్ మహానాయకుడు రెండు సినిమాలు సుమారు నెల రోజుల గ్యాప్ తో రిలీజ్ అయ్యాయి. అయితే ఊహించిన దానికన్నా ఘోరంగా ఈ సినిమా విఫలమైంది. కథానాయకుడు సినిమా అయినా రిలీజ్ కు ముందు బజ్ ఉంది. మహానాయకుడు అది కూడా తెచ్చుకోలేదు.

లాస్ట్ ఫ్రైడే రిలీజైన మహానాయకుడు రిజల్ట్ కూడా షాక్ ఇచ్చింది. సెకండ్ పార్ట్ కూడా ఆడియెన్స్ పెదవి విరిచేలా చేసింది. క్రిష్ డైరక్షన్ వల్లే ఈ సినిమా పోయిందని కొందరు అంటుంటే సినిమాను తెరకెక్కించే విధానం కొత్తగా ఏమి చెప్పలేదన్న కారణం చేతనే సినిమా పోయిందని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా సినిమా రిజల్ట్ నిరాశపరచగా వసూళ్లైతే లక్షల్లో ఉన్నాయి. ఇంత దారుణంగా సినిమా రిజల్ట్ ఉంటుందని ఊహించని డిస్ట్రిబ్యూటర్స్ భారీ లాసులు ఫేస్ చేయాల్సి వస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news