Gossipsహీరోల 'సిక్స్ ఫ్యాక్' పై షాకింగ్ కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్

హీరోల ‘సిక్స్ ఫ్యాక్’ పై షాకింగ్ కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోలను ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రస్తుతం జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి… అక్కడి ఎన్నారై లతో కలిసి నిర్వహించిన ‘ప్రవాసాంధ్ర గర్జన’ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ అనేక రాజకీయ అంశాలను కూడా ప్రస్తావిస్తూ …. సిక్స్ ప్యాక్ కల్చర్ పై కూడ సంచలన వ్యాఖ్యలు చేసాడు. అంతే కాదు తాను ఊహ తెలిసినప్పటి నుంచి తాను దేనికైతే భయపడతానో ఆ విషయాన్ని తాను తప్పకుండా చేస్తాను అంటూ భయాన్ని జయించడం తన హాబీ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

ఇదే సందర్భంలో ప్రస్తుత తరం యూత్ కు మ్యానియాగా మారిన సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ గురించి మాట్లాడిన పవన్ ధైర్యం అంటే కండలు పెంచడం కాదనీ ధైర్యం పెరగాలి అంటే మనిషి పిరికి తనాన్ని జయించాలి అంటూ తమ ఫిలిం ఇండస్ట్రీలో కూడ ఈ సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ కల్చర్ బాగా పెరిగిపోయింది అంటూ పరోక్షంగా హీరోలకు చురకలు అంటించాడు పవన్. సమస్యలతో పోరాడాలి అంటే ముందుగా మనిషి భయాన్ని జయించాలి అంటూ పవన్ వ్యాఖ్యానించాడు. అదే విధంగా భయం గురించి మరింత లోతుగా మాట్లాడుతూ ప్రతి మనిషికీ భవిష్యత్ మీద భయం ఉండటం చాలా సహజం అన్నారు.

యువనతంతా ధైర్యాన్ని వదిలిపెట్టకుండా ముందుకు వెళ్లాలని డల్లాస్ ప్రాంతలో యువతకు పిలుపు ఇచ్చాడు పవన్. ఇక తన సినిమాల కెరియర్ గురించి మాట్లాడుతూ గతంలో తాను మొదలు పెట్టి ఆపేసిన సత్యాగ్రహి సినిమా గురించి కూడా పవన్ ప్రస్తావించాడు. ఆ సినిమా కథలో హీరో తాను నిజ జీవితంలో ఏమి చేస్తున్నానో అవే పనులు సత్యాగ్రహి సినిమా కథలో హీరో చేస్తాడనీ అంటూ సినిమాలలో హీరోలు పోరాటం చేస్తే జనం కష్టాలు తీరవు అంటూ మరొకసారి మాస్ హీరోల సినిమాల కథల పై సెటైర్లు వేసాడు పవన్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news