ఆన్ లైన్ లో 2.0 హెచ్.డి ప్రింట్.. తమిళ్ రాకర్స్ కొంపముంచేశారు..!

భారీ అంచనాలతో భారీ బడ్జెట్ తో వచ్చిన 2.ఓ రజిని, శంకర్ ల క్రేజీ కాంబినేషన్ కు తగిన అంచనాలను అందుకుంది. అయితే సినిమాపై అంచనాలు ఊహించని విధంగా ఉండటం వల్ల అక్కడక్కడ కొద్దిగా మిక్సెడ్ టాక్ వచ్చింది. ఇదిలాఉంటే సినిమా రిలీజ్ ముందే తమిళ్ రాకర్స్ 2.ఓని పైరసీ ప్రింట్ రిలీజ్ చేస్తామని అది కూడా హెచ్.డి క్వాలిటీతో రిలీజ్ చేస్తామని అన్నారు.
రజినీకాంత్  2.0 మూవీ రివ్యూ & రేటింగ్
చెప్పినట్టుగానే గురువారం సాయంత్రం కల్లా 2.ఓ హెచ్.డి ప్రింట్ ఆన్ లైన్ లో లీక్ చేశారు. అయితే ఈ లీక్ సినిమా కలక్షన్స్ మీద పెద్దగా ఎఫెక్ట్ చూపించే అవకాశం లేదు. విజువల్ గ్రాండియర్ గా వచ్చిన 2.ఓ సినిమాను సివర్ స్క్రీన్ మీద.. ఆ థియేటర్ ఎక్స్ పీరియెన్స్ లోనే ఎంజాయ్ చేస్తారు. అదిగాక 3డి సినిమా కాబట్టి లీకైన సినిమా కూడా అంత క్వాలిటీ లేదట.
3
సినిమా రిలీజ్ ముందు తమిళ రాకర్స్ చేసిన ప్రకటనకు 2.ఓ ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా లాభం లేకుండాపోయింది. మరి దీనిపై 2.ఓ నిర్మాత ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడో చూడాలి.

Leave a comment