Gossips" సవ్యసాచి " సెన్సార్ రివ్యూ.. సెన్సార్ సభ్యులు షాక్..!

” సవ్యసాచి ” సెన్సార్ రివ్యూ.. సెన్సార్ సభ్యులు షాక్..!

నాగ చైతన్య, చందు మొండేటి కాంబినేషన్ లో వస్తున్న సవ్యసాచి మూవీ నవంబర్ 2న రిలీజ్ కాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో చైతు సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఎం.ఎం కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా సినిమాలోని పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి.

ఈరోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా యు/ఏ సర్టిఫికెట్ అందుకుంది. నాగ చైతన్యకు ఈ సినిమా పక్కా హిట్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారట సెన్సార్ సభ్యులు. ఇక ట్రైలర్ లో చూపించిన విధంగా సినిమా అంతా ఆసక్తి కరంగా ఉంటుందని తెలుస్తుంది.

ఎడమ చేయి తన మాట వినని హీరో తన ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉండగా వారిని ఎలా కాపాడాడు అన్నది సినిమా కథ. మాధవన్ విలన్ గా మంచి మార్కులు కొట్టేస్తాడని తెలుస్తుంది. సినిమాలో భూమిక పాత్ర కూడా ప్రేక్షకులను అలరించడం ఖాయమని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news