రోహిత్‌ 162 : మరో ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ..

ఇండియా వెస్టిండీస్ తో జరుగుతున్న వన్ డే సీరీస్ లో భాగంగా నాల్గవ వన్ డే ముంబై బ్రాబోర్న్ స్టేడియంలో జరుగుతుంది. టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. దూకుడు మీద ఉన్న రోహిత్ మరో సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. మ్యాచ్ లో 137 బంతులు ఆడిన రోహిత్ శర్మ 162 పరుగులు చేశాడు. ఇప్పటికే వన్ డేల్లో 20 సెంచారీలు సాధించిన రోహిత్ శర్మ ఈ సెంచరీతో 21వ సెంచరీ అందుకున్నాడు.

ఇక వీటిల్లో 7 సార్లు 150 దాటిన ఆటగాడిగా ప్రత్యేక రికార్డ్ అందుకున్నాడు. వన్ డేల్లో 3 సార్లు 200 కొట్టిన ఆటగాడిగా చెరిగిపోని రికార్డ్ తన సొంతం చేసుకున్న రోహిత్ శర్మ చేసిన 21 సెంచరీలలో 7 సార్లు 150 ప్లస్ అవడం విశేషం. ఇక ప్రస్తుతం జరుగుతున్న వెస్టిండీస్ మ్యాచ్ లలో రోహిత్ శర్మ ఫుల్ ఫాం లో ఉన్నాడు.

ఈరోజు వన్ డే స్కోర్ విషయానికొస్తే రోహిత్ తో పాటుగా అంబటి రాయుడు అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యం చూపిస్తున్నాడు. అతను కూడా సెంచారీ సాధించాడు. ప్రస్తుతం 44 ఓవర్లు ముగియగా 336 పరుగులతో 3 వికెట్లు కోల్పోయింది భారత జట్టు.

వర్సెస్ ఆస్ట్రేలియా 209 పరుగులు 2013 (బెంగళూరు)
వర్సెస్ శ్రీలంక 264 పరుగులు 2014 (కలకత్తా)
వర్సెస్ సౌతాఫ్రికా 150 పరుగులు 2015 (కాన్పూర్)
వర్సెస్ ఆస్ట్రేలియా 171 పరుగులు 2016 (పెర్త్)
వర్సెస్ శ్రీలంక 208 పరుగులు 2017 (మొహాలి)
వర్సెస్ వెస్టిండీస్ 152 పరుగులు 2018 (గౌహతి)
వర్సెస్ వెస్టిండీస్ 162 పరుగులు 2018 (ముంబై)

Leave a comment