“అరవింద సమేత ” యుఎస్ క్లోజింగ్ బిజినెస్.. తారక్ కెరీర్‌లో మరొకటి..!

దసరా కానుకగా వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మూవీ ‘అరవింద సమేత’ బాక్సాఫీస్ దగ్గర ఇంకా తన సందడి తగ్గించలేదు. తారక్‌ యాక్షన్‌కు త్రివిక్రమ్ డైరెక్షన్‌ తోడుకావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. త్రివిక్రమ్ మార్క్ డైరెక్షన్‌తో తారక్ పీక్ పర్ఫార్మెన్స్‌తో అరవింద సమేత ఫ్యాన్స్‌కు నిజమైన దసరాను అందించింది.

అయితే ఈ సినిమాకు ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ కలెక్షన్ల దగ్గర కాస్త డల్‌గానే నిలిచింది. ఇటు తెలుగు బాక్సాఫీస్ వద్ద తారక్ మరియు త్రివిక్రమ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఈ సినిమా నిలిచింది. కానీ ఓవర్సీస్‌లో ఈ సినిమా వెనుకంజ వేసింది. బ్లా్క్‌బస్టర్ హిట్‌గా నిలుస్తుందని అనుకున్న చిత్ర యూనిట్ మరియు బయ్యర్లకు అరవింద సమేత నిరాశనే మిగిల్చింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా 2.7 మిలియన్ డాలర్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేయగా, టోటల్ రన్ ముగించుకుని 2.17 మిలియన్ డాలర్ల వద్ద బిజినెస్ క్లోజ్ చేసింది. కాగా త్రివిక్రమ్ కెరీర్‌లో 2 మిలియన్ డాలర్ల మైలురాయి దాటిన మూడో చిత్రంగా ఇది రికార్డు క్రియేట్ చేసింది. బ్రేక్ ఈవెన్ అందుకోకపోవడంతో అరవింద సమేతను అక్కడ ఫ్లాప్‌ అనే అంటున్నారు.

ఇటు తెలుగు రాష్ట్రాల్లోసైతం ఈ సినిమా బిజినెస్ ముగించుకోవడానికి రెడీ అయ్యింది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.83+ కోట్ల షేర్ వసూళ్లు సాధించింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు విలన్ పాత్రలో మెప్పించాడు.

Leave a comment