Gossipsలైంగిక వేధింపులు...5 కోట్లతో శ్రుతికి చుక్కలు చూపించిన అర్జున్..!

లైంగిక వేధింపులు…5 కోట్లతో శ్రుతికి చుక్కలు చూపించిన అర్జున్..!

‘మీ టు’ ఎఫెక్ట్ అన్ని చిత్ర పరిశ్రమలను కుదిపేస్తోంది. ఇప్పటికే అనేక మంది మీద ఆరోపణలు రావడం వాటి వివరణ ఇవ్వడం ఇలా మారింది ఈ నేపథ్యంలో ఇటీవల యాక్షన్ కింగ్ అర్జున్ పై నటి శృతి హరిహరణ్ చేసిన ఆరోపణలు ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఈ విషయమై ఇండస్ట్రీలో ఖుష్బూ సహా పలువురు నటీమణులు అర్జున్‌కు మద్దుతుగా మాట్లాడతున్నారు.

ఇక ప్రకాష్ రాజ్ సహా మరికొంత మంది నటీనటులు శృతి హరిహరన్‌కు బాసటగా నిలుస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్య సయోధ్య కుదిరిన వార్తలు వినిపించాయి. తాజాగా అర్జున్ మీద లేనిపోని ఆరోపణలు చేసిన శృతి తగిన మూల్యం చెల్లుంచు కోవాల్సిందేనని అర్జున అభిమానులు, మద్దతు దారులు అంటున్నారు. తాజాగా అర్జున్‌పై మీటూ ఆరోపణలు చేసిన శృతి హరిహరణ్‌పై అర్జున్ మేనల్లుడు ప్రముఖ హీరో ధృవ సర్జ …రూ.5 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేశాడు.

ఇక అర్జున్ పై శృతి ఆరోప‌ణ‌లు చేసిన అనంత‌రం ప‌లువురు సీనియ‌ర్ హీరోయిన్లు అర్జున్ చాలా మంచి వ్య‌క్తి అని చెబుతుండగా .. అర్జున్ కూడా తన సినీ కెరియర్లో ఎంతోమంది హీరోయిన్ లతో చేశానని కానీ ఎప్పుడూ ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించలేదని చెప్పుకొస్తున్నాడు. అర్జున్ – శృతి వ్యవహారం రాజీ దిశగా వెళ్తుందన్న నేపథ్యంలో మళ్ళీ ఈ పరువు నష్టం దావా వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిప్పుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news