Gossipsరెండు హిట్స్ తోనే రష్మిక కి పొగరు ఎక్కేసిందా..?

రెండు హిట్స్ తోనే రష్మిక కి పొగరు ఎక్కేసిందా..?

కన్నడలో కిరాక్ పార్టీ సినిమాతో సూపర్ పాపులర్ అయిన రష్మిక తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ సినిమా హిట్ తో అమ్మడి క్రేజ్ పెరగగా ఆ తర్వాత వచ్చిన గీతా గోవిందం సినిమా ఆమె ఖాతాలో మరో హిట్ అందించింది. రెండు బ్యాక్ టూ బ్యాక్ హిట్లు అందుకున్న ఈ అమ్మడు తన రెమ్యునరేషన్ పెంచిందని తెలుస్తుంది.

ఛలో, గీతా గోవిందం సినిమాలకు 20 లక్షలు మాత్రమే తీసుకున్న రష్మిక ఇప్పుడు తన దగ్గరకు వస్తున్న వారికి 50 నండి 60 లక్షలు ఇస్తేనే అంటూ డిమాండ్ చేస్తుందట. రెండు హిట్లతో రష్మికకు ఇంత పెరిగిందా అంటే నిజమే కాని అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్ లక్కీ హీరోయిన్ గా మారింది కాబట్టి అమ్మడి డిమాండ్ మేరకు రేటు కూడా ఓకే అని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news