Gossipsచరణ్ ఛాన్స్ వదులుకుందా.. ఆరెక్స్ భామ ఏంటీ అతి..!

చరణ్ ఛాన్స్ వదులుకుందా.. ఆరెక్స్ భామ ఏంటీ అతి..!

ఆరెక్స్ 100 సినిమాతో కుర్రాళ్ల మనసులు గెలిచిన పాయల్ రాజ్ పుత్ ఈమధ్య ఓ నిర్మాత తనని డైరెక్ట్ గా కమిట్మెంట్ అడిగాడని వార్తల్లో నిలిచింది. మొదటి సినిమా బోల్డ్ కంటెంట్ తో వచ్చేసరికి అమ్మడికి వస్తున్న ఆఫర్లన్ని అలాంటివే అని తెలుస్తుంది. ఇక ఈమధ్యలో పాయల్ వచ్చిన 3 క్రేజీ ఆఫర్స్ ను కాదన్నదట.

అందులో రాం చరణ్ సినిమా కూడా ఉందని తెలుస్తుంది. ఆరెక్స్ 100 తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వచ్చినా కాదనేసిన పాయల్ అఖిల్ వెంకీ అట్లూరి సినిమాలో కూడా స్పెషల్ రోల్ ఛాన్స్ ఇస్తానన్నా వద్దనేసిందట. ఈ రెండు ఓకే కాని ఇప్పుడు ఏకంగా రాం చరణ్ సినిమాలో ఐటం సాంగ్ ఛాన్స్ కూడా వదులుకుందట అమ్మడు.

స్టార్ సినిమాల్లో ఐటం సాంగ్ అంటే అభిమానుల్లో గుర్తింపు వచ్చినట్టే. అదీగాక ఈమధ్య హీరోయిన్సే స్టార్ సినిమాల్లో స్పెషల్ సాంగ్ చేస్తున్నారు మరి అలాంటిది పాయల్ ఎందుకు చరణ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనందో అని డౌట్ పడుతున్నారు. అమ్మడు తీసుకున్న ఈ నిర్ణయం ఖచ్చితంగా తన కెరియర్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. బోయపాటి శ్రీను సినిమాలో చరణ్ చేస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news