చిరు బర్త్ డే స్పెషల్ హైలెట్స్..!

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే అంటే మెగా ఫ్యాన్స్ కు ఓ ఉత్సవం లాంటిదే. 63వ పుట్టినరోజు జరుపుకుంటున్న మెగాస్టార్ కు ఫ్యాన్స్ అంతా అదిరిపోయే రేంజ్ లో బర్త్ డే విశెష్ అందించారు. బర్త్ డే కానుకగా నిన్న ఉదయమే సైరా సినిమా టీజర్ వదలగా ఆ టీజర్ యూట్యూబ్ లో సంచలంగా మారింది. మరోపక్క చిరుకి సిని సెలబ్రిటీస్ అంతా తమ విశెష అందించడం విశేషం.

ఇక చిరు బర్త్ డే లో భాగంగా నిన్న జరిగిన ఫ్యాన్స్ మీట్ లో చిరు అభిమానులకు సన్మానం జరిగింది. అందులో సునీల్ కూడా ఉండటం విశేషం. ఇక మాటల రచయిత సాయి మాధవ్ బుర్ర కూడా ఈ ఫ్యాన్స్ మీట్ లో సన్మానం అందుకున్నారు. ఇక ఈరోజు స్పెషల్ గా పవన్ కళ్యాణ్ చిరు ఇంటికి వెళ్లి మరి కలవడం విశేషం. ఆంధ్రాలో పాదయాత్ర చేస్తున్న పవన్ ఆ యాత్రని ఆపిమరి అన్నయ్యని విష్ చేసేందుకు వచ్చారు.

ఈ సందర్భంగా పవన్ చిరు కలిసి దిగిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఇయర్ చిరు కల నెరవేరబోతుంది చిరంజీవి 12 ఏళ్లుగా కల కంటున్న సైరా తెరకెక్కుతుంది. మరి ఈ సైరా చిరంజీవి కెరియర్ లో ఎలాంటి సంచలన విజయం అందుకుంటుందో చూడాలి.

#happybirthday Chikkababai

A post shared by Sneha (@allusnehareddy) on

Leave a comment