Gossipsఅంచనాలు పెంచుతున్న ఎన్టీఆర్ లీక్ వీడియో !

అంచనాలు పెంచుతున్న ఎన్టీఆర్ లీక్ వీడియో !

టాలీవుడ్ లో ఈ మద్య యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోరు బాగా పెరిగిపోయింది. జూ.ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం చిత్రీకరణ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది. ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఇందులో ఎన్టీఆర్ను కొత్తగా చూపించబోతున్నారు. అందులో భాగంగా ఎన్టీఆర్ చాలా సైలెంట్గానే సిక్స్ప్యాక్ చేసేసిన సంగతి తెలిసిందే. గతంలో వరుసగా వచ్చిన బాద్షా, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్, జై లవకుశ చిత్రాలలో ఎన్టీఆర్ పొంతనలేని విభిన్నమైన పాత్రలను పోషించడంతో పాటు ఏ సినిమాకు ఆ సినిమాలో కొత్తగా కనిపించిన సంగతి గుర్తుండే ఉంటుంది.

ప్రస్తుతం తారక్ తన 25వ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించడపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషంలో ఉన్నారు. కానీ ఆ మద్య త్రివిక్రమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో తీసిన సినిమా ‘అజ్ఞాతవాసి’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మరి ఈసారి త్రివిక్రమ్ ఎలా టేకోవర్ చేస్తారో అని ఫ్యాన్స్ కాస్త ఖంగారు పడుతున్నారు. ఒకవేళ ఈ సినిమా గనక ఫ్లాప్ అయ్యిందీ అంటే..ఇద్దరి కెరీర్ లకు ప్రమాదం ఉండబోతుందని సిగ్నల్స్ వస్తున్నాయి. కాగా, ఈ ఇద్దరూ కలిసి మొదటిసారి పనిచేస్తుండటంతో ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే ఈ మద్య షూటింగ్స్ కి సంబంధించిన ఫోటోలు లీక్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి ఓ ఫోటో లీక్ అయ్యింది..ఈ ఫోటోలో ఎన్టీఆర్ సీరియస్ గా ఉన్నారు..ఆయన తండ్రిగా నటిస్తున్న నాగబాబు ఏదో ప్రమాదంలో ఉన్నట్లు కనిపిస్తుంది. అంటే ఈ సినిమా ఎంతో ఎమోషన్ ఉండబోతుందో అర్థమవుతుంది. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజాహెగ్డే, ఈషా రెబ్బ నాయికలుగా నటిస్తుండగా…తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలని అనుకుంటున్నారు.

1232

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news