Gossipsఆ హీరోయిన్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన రాజేంద్రప్రసాద్!

ఆ హీరోయిన్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన రాజేంద్రప్రసాద్!

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ నిన్న జరిగిన శ్రీనివాస కళ్యాణం సినిమా ఆడియో రిలీజ్ కు సతీసమేతంగా వచ్చారు. తన ఇన్నేళ్ల కెరియర్ లో తన భార్యతో సినిమా ఆడియోకి రావడం ఇదే మొదటిసారని ఆయన చెప్పారు. ఇక ఈ వేడుకలో ఈ సినిమా ఆడియోకి తన భార్యను తీసుకురావడానికి గల కారణం కూడా చెప్పారు రాజేంద్ర ప్రసాద్.

పెళ్లి విశిష్టతను చెప్పే అద్భుతమైన సినిమా ఇదని అన్నారు రాజేంద్ర ప్రసాద్. దీనికి పూనం నవ్వేసరికి ‘పూనం యు ఆర్ టూ యంగ్ టూ ఫీల్ లైక్ దిస్’ అని అన్నారు రాజేంద్ర ప్రసాద్. నేను సిన్సియర్ గా మాట్లాడుతున్నప్పుడు నువ్వలా నవ్వడం సరికాదు అని అన్నాడు నటకిరీటి. సినిమా ద్వారా మంచి ఫీల్ కలిగింది రేపు ఆడియెన్స్ కు ఆ ఫీల్ కలుగుతుందని అన్నారు. తండ్రి లాంటి స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు లానే మంచి సినిమాలు తీయాలన్న దిల్ రాజు అభిలాష మంచిదని అదే సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ను చేస్తుందని అన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news