Gossipsఎన్టీఆర్ పై మనసుపడ్డ శ్రీరెడ్డి..!

ఎన్టీఆర్ పై మనసుపడ్డ శ్రీరెడ్డి..!

సంచలనాల శ్రీరెడ్డి విమర్శించే వ్యక్తిని ఉద్దేశించి కామెంట్స్ చేస్తూ మరోపక్క యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ను పొగడ్తలతో ముంచెత్తుతుంది. కాస్టింగ్ కౌచ్ విషయంలో కాస్త గట్టిగా ఉన్న శ్రీరెడ్డి ఆ కామెంట్స్ పక్కదారి పట్టడంతో వ్యవహారం ముగిసినట్టైంది. ఇక లేటెస్ట్ గా నాని మీద విరుచుకు పడుతున్న అమ్మడు బిగ్ బాస్-2 నాని హోస్టింగ్ గురించి విమర్శలు చేస్తుందు.

నాని బిగ్ బాస్ హోస్టింగ్ అసలు ఏమాత్రం బాగాలేదని శ్రీరెడ్డి కామెంట్స్ చేస్తుంది. ఇక మొదటి సీజన్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేశాడు కాబట్టి బిగ్ బాస్ గురించి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. షో మొదలైన రోజే బిగ్ బాస్ లో ఎన్.టి.ఆర్ ను మిస్సవుతున్నారని.. ఆయన స్థానం ఎవరు భర్తీ చేయలేరని ట్వీట్ చేసింది. ఇక లేటెస్ట్ గా ఈ తరానికి జూనియర్ ఎన్.టి.ఆర్ కింగ్ ఆఫ్ టాలీవుడ్. బిగ్ బాస్ కు సింహం లాంటి వారు అంటూ కామెంట్ పెట్టింది.

నానిని టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి తారక్ ను ఆకాశానికెత్తేస్తుంది. అయితే శ్రీరెడ్డి చేస్తున్న కామెంట్స్, ట్వీట్స్ మీద నాని లీగల్ యాక్షన్ కు దిగిన విషయం తెలిసిందే. మరి నాని ఈ విషయంపై ఎలా స్పందిస్తాడో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news