GossipsRGVనా మజాకా..! దరిదాపులకు రాలేని రికార్డ్స్..!

RGVనా మజాకా..! దరిదాపులకు రాలేని రికార్డ్స్..!

కింగ్ నాగార్జున కెరియర్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన ఆఫీసర్ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఒకప్పటి నాగర్జునని గుర్తుచేయడం విశేషం. నాగ్ కెరియర్ లో భారీ డిజాస్టర్ అంటే ఆకాశ వీధిలో సినిమా. ఆ సినిమా తర్వాత మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కి తన సత్తా చాటాడు నాగ్.

ఇక ఆఫీసర్ ఆకాశ వీధిలో సినిమా కూడా తలదన్నేలా డిజాస్టర్ అయ్యింది. కనీసం మెయింటైనెన్స్ ఖర్చులు కూడా రాకుండా జీరో షేర్ తో ఆఫీసర్ సినిమా వసూళ్లు ఉండటం ఆశ్చర్యకరం. స్టార్ హీరో అయిన నాగార్జున ఇలాంటి దారుణమైన సినిమా తీస్తాడని ఊహించి ఉండరు.

ఇప్పుడున్న స్టార్ హీరోలకు పోటీ ఇస్తున్న సీనియర్ హీరోల్లో నాగార్జున కూడా ఒకరు. అలాంటిది నాగ్ కెరియర్ నే తలకిందులు అయ్యేలా చేసింది ఆఫీసర్. వర్మతో శివ చేసిన నమ్మకం కొద్ది ఈ సినిమా చేశాడు. కాని వర్మ ఎఫెక్ట్ ఈ సినిమాపై బాగా పడ్డది. ఇక ఇప్పుడు ఏ ఫ్లాప్ సినిమా అయినా సరే ఆఫీసర్ తో పోల్చేస్తారని చెప్పడంలో సందేహం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news