Specialsబిగ్ బాస్-2 మేకింగ్ వీడియో..!

బిగ్ బాస్-2 మేకింగ్ వీడియో..!

బిగ్ బాస్ సెకండ్ సీజన్ మరో వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. స్టార్ మా ఎంతో ప్రెస్టిజియస్ గా ఈ రియాలిటీ షోని రన్ చేస్తుంది. మొదటి సీజన్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేయగా సెకండ్ సీజన్ కు నానిని హోస్ట్ గా చేశారు. తన నాచురల్ టాలెంట్ తో బుల్లితెర ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు వస్తున్నాడు నాని.

ఇక ఈ షో మొదలవబోతున్న ఈ తరుణంలో షోకి కావాల్సినంత ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈమధ్యనే రోజుకో ప్రోమో రిలీజ్ చేస్తుండగా దీనికి సంబందించిన మేకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈసారి కాస్త మసాలా ఎక్కువని ప్రోమో ద్వారా చెప్పాడు నాని.

మేకింగ్ వీడియో కూడా బిగ్ బాస్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ఇక ఈ సీజన్ లో ఎవరెవరు కంటెస్టంట్స్ గా వస్తున్నారు అన్న విషయంపై రోజుకో లిస్ట్ బయటకు వస్తుంది. కాని ఇందులో ఏది వాస్తవం అన్నది తెలియట్లేదు. జూన్ 10న అది రివీల్ చేయాలని చూస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news