Newsఎన్టీఆర్ ఇంట్లో మహలక్ష్మి.. ఫేక్ అనేసిన మహేష్..!

ఎన్టీఆర్ ఇంట్లో మహలక్ష్మి.. ఫేక్ అనేసిన మహేష్..!

తారక్, లక్ష్మి ప్రణతిలకు రెండవ సంతానంగా ముద్దుల కూతురు జన్మించిందని.. ఆదివారం రాత్రి 10:30 గంటలకు తారక్, ప్రణీతలకు కూతురు పుట్టిందని సోషల్ మీడియాలో న్యూస్ హల్ చల్ చేస్తుంది. తారక్, ప్రణతిలకు మొదటి సంతానంగా అభయ్ రాం పుట్టాడు.

ఇక ఇప్పుడు రెండవ సంతానంగా కూతురు పుట్టిందని వార్తలు వచ్చాయి. కూతురు పుట్టినందుకు ఎన్.టి.ఆర్ చాలా ఆనందంగా ఉన్నాడని వార్తలు హంగామా చేస్తున్నాయి. ఇక తమ అభిమాన నటుడుకి కూతురు పుట్టిందని తెలియగానే ఫ్యాన్స్ ట్విట్టర్, ఫేస్ బుక్ ల ద్వారా తారక్ కు కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే అసలు అలాంటిదేమి జరుగలేదట. ఇదంతా ఫేక్ న్యూసే అంటూ తారక్ పి.ఆర్ మహేష్ కోనేరు స్పందించడం జరిగింది. కొద్ది గంటలుగా తారక్ ఇంట మహాలక్ష్మి అని వార్తలు ఊపందుకోగా ఇదంతా ఫేక్ అని తెలిసి ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news