Gossipsరికార్డ్స్ ని తుడిచి పడేసిన అజిత్..!

రికార్డ్స్ ని తుడిచి పడేసిన అజిత్..!

సౌత్ సినిమాలంటే బాలీవుడ్ లో సూపర్ క్రేజ్. అందుకే ఇక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలు అక్కడ రీమేక్ అయ్యి సూపర్ హిట్ సాధించాయి. రీమేక్ అవకుండా కూడా కొన్ని సినిమాలు అక్కడ రికార్డులు సృష్టించాయి. సౌత్ సినిమా అంటే డబ్బింగ్ వర్షన్ కు భారీ క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలు హింది డబ్బింగ్ వర్షన్ యూట్ ట్యూబ్ లో రికార్డ్ వ్యూయర్ షిప్ సాధిస్తాయి.

సరైనోడు సినిమా టోటల్ వ్యూయర్స్ కోటి దాటాయి. ఆ సినిమా యూట్యూబ్ లో పెట్టిన 24 గంటల్లో అంటే ఒక్కరోజులో 5 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డులు సృష్టించింది. అయితే బన్ని రికార్డ్ బీట్ చేయడం ఎవరి వల్ల కాదని అనుకున్నారు కాని అజిత్ ఆ రికార్డ్ కొల్లగొట్టేశాడు. బన్ని సరైనోడు రోజులో 5 మిలియన్ వ్యూస్ సాధించగా అజిత్ నటించిన వివేగం 24 గంటల్లో 8 మిలియన్ వ్యూస్ సాధించింది.

శివ డైరక్షన్ లో వచ్చిన వివేగం సినిమా తమిళంలో అంత పెద్ద హిట్ అవలేదు. తెలుగులో వివేకం పేరుతో కూడా రిలీజ్ చేశారు ఇక్కడ అంత మంచి ఫలితాన్ని రాబట్టుకోలేదు కాని హింది డబ్బింగ్ వర్షన్ మాత్రం రికార్డులు సృష్టిస్తుంది. బాహుబలి తర్వాత సౌత్ సినిమాలకు నేషనల్ వైడ్ గా క్రేజ్ పెరిగింది. అజిత్ వివేగం యూట్యూబ్ లో సరికొత్త సంచలనాలు సృష్టిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news