Gossipsనేల టికెట్టు ఫలితం ముందే ఊహించిన రవితేజ..!

నేల టికెట్టు ఫలితం ముందే ఊహించిన రవితేజ..!

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వచ్చిన సినిమా నేల టిక్కెట్టు. ఎస్.ఆర్.టి మూవీ బ్యానర్ లో రాం తాళ్లూరి నిర్మించిన ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది. ఇక నిన్న మొదటి షో నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఫలితం రవితేజ ముందే ఊహించాడని అందరు అంటున్నారు.

సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల తర్వాత కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. కాని వాటిని ఏమాత్రం అందుకోలేకపోయింది ఈ సినిమా. కథ, కథనాలు పరమ రొటీన్ అనిపించగా సినిమా చూసిన ఆడియెన్స్ నేల నాకించేశారు అన్న భావనలో ఉన్నారు. కళ్యాణ్ కృష్ణ కథ చెప్పినప్పుడు ఎక్సైట్ అయిన రవితేజ సినిమా అవుట్ పుట్ చూసుకున్నాక సినిమా తేడా కొట్టేసిందని డిసైడ్ అయ్యాడట. అందుకే సినిమా ప్రమోషన్స్ లో అంతగా పాల్గొనలేదు.

రాజా ది గ్రేట్ సినిమా టైంలో రవితేజ ప్రతి ఈవెంట్ కు వచ్చాడు కాని నేల టిక్కెట్టు మాత్రం దర్శకుడు, హీరోయిన్ చేసిన ప్రమోషన్ కూడా రవితేజ చేయలేదు. దీన్ని బట్టి రవితేజ సినిమా రిజల్ట్ ముందే ఊహించి ఇలా చేసి ఉంటాడని అంటున్నారు. రాజా ది గ్రేట్ హిట్ తర్వాత టచ్ చేసి చూడు ఫ్లాప్ చవిచూసిన రవితేజకు నేల టిక్కెట్టు మరో డిజాస్టర్ గా మిగిల్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news