Gossipsషాకింగ్ న్యూస్ : భార్యతో విడిపోతున్న ప్రముఖ దర్శకుడు..!

షాకింగ్ న్యూస్ : భార్యతో విడిపోతున్న ప్రముఖ దర్శకుడు..!

టాలీవుడ్ లో మరో జంట విడాకులకు అప్లై చేసింది. సక్సెస్ ఫుల్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న ఈ డైరక్టర్ కనీసం రెండేళ్లు కూడా కాపురం చేయకుండానే విడాకులకు అప్లై చేయడం ఆశ్చర్యకరం. తానో డైరక్టర్ తన భార్య ఓ డాక్టర్ ఇద్దరి ప్రొఫెషన్ వేరు.. ఇద్దరి ఆలోచనలు వేరు. అయినా సరే ఎరేంజెడ్ మ్యారేజ్ తో ఒక్కటైన ఈ ఇద్దరు రెండేళ్లు గడవకముందే విడాకులకు అప్లై చేశారు.

ఇంతకీ ఎవారా దర్శకుడు అంటే ఇంకెవరు రాధాకృష్ణ జాగర్లమూడి అలియాస్ క్రిష్ అని తెలుస్తుంది. గమ్యం సినిమా నుండి తన ప్రతి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న క్రిష్ 2016 ఆగస్టులో డాక్టర్ రమ్యను పెళ్లి చేసుకోవడం జరిగింది. బాలయ్య 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి టైం లో తన భార్య రమ్య కూడా ఎంతో సపోర్ట్ గా నిలిచిందని క్రిష్ సభాముఖంగానే అన్నాడు. మరి ఏమైందో ఏమో కాని ఈ ఇద్దరు విడాకులకు అప్లై చేశారట.

ఇద్దరి సమ్మతంతోనే ఈ డైవర్స్ అప్లై చేయడం జరిగిందని తెలుస్తుంది. దీనికి గల కారణాలు కేవలం వృత్తి రీత్యా ఇద్దరు బిజీ అవడమే అని చెబుతున్నారు. ఎంత వృత్తి రీత్యా బిజీ అయినా వారి మధ్య ప్రేమ ఉంటే చేస్తున్న పని.. దొరికిన ఖాళీ టైమునే ఎంజాయ్ చేయొచ్చు.. కాని క్రిష్, రమ్యల మధ్య అలాంటి పరిస్థితి కనబడటం లేదు. మరి ఈ డైవర్స్ కు అసలు కారణాలు ఏంటో తెలిలియాల్సి ఉంది. మొత్తానికి టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ క్రియేటివ్ డైరక్టర్ క్రిష్ తన భార్యతో విడిపోవాలని అనుకోవడం సిని పరిశ్రమకు షాక్ అనే చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news