Reviewsనాగార్జున,రామ్ గోపాల్ వర్మ ల ఆఫీసర్ రివ్యూ & రేటింగ్ :...

నాగార్జున,రామ్ గోపాల్ వర్మ ల ఆఫీసర్ రివ్యూ & రేటింగ్ : అంచనాలను నిలబెట్టింది..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, కింగ్ నాగార్జున కాంబినేషన్ లో సినిమా అంటే అందరికి శివ సినిమానే గుర్తుకొస్తుంది. పాతికేళ్ల తర్వాత నాగార్జునను మెప్పించే కథతో వచ్చాడు ఆర్జివి. ఈమధ్య వరుసగా ఫెయిల్యూర్స్ తీస్తున్న ఆర్జివి ఆఫీసర్ గా నాగార్జునను ఎలా చూపించాడో అని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. మరి సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

పోలీస్ ఆఫీసర్ నారాయణ పసారి ముగ్గురు వ్యక్తులను తన స్వలాభం కోసం ఫేక్ ఎంకౌంటర్ చేస్తాడు. ఈ కేసు విషయమై ముంబైకు వెళ్తాడు శివాజి రావు ఐపిఎస్ (నాగార్జున). ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన శివాజి రావు నారాయణ పసారి చేసిన ఫేక్ ఎంకౌంటరే అని ప్రూవ్ చేసి అతన్ని అరెస్ట్ చేయిస్తాడు. అప్పటి నుండి నారాయన శివాజి రావు మీద పగ పెంచుకుంటాడు. ఇక తన కూతురితో జాలీగా జీవితం గడుపుతున్న శివాజి రావుకి అనుకోకుండా కొన్ని ఎదురుదెబ్బలు తగులుతాయి. దీనికి కారణం ఎవరు..? శివాజి తన ప్రాబ్లెమ్స్ ను ఎలా సాల్వ్ చేశాడు..? విలన్ ఆటలను ఎలా కట్టడి చేశాడు అన్నది ఆఫీసర్ సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

ఆఫీసర్ గా నాగార్జున మరోసారి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంటెన్స్ ఉన్న స్టోరీలో అంతే ఇంటెన్సిటీతో నటించాడు నాగార్జున. హీరోయిన్ మైరా సరీన్ కూడా బాగానే చేసింది. నారాయణ పసారి విలనిజం బాగుంది. సినిమాలో నటించిన చిన్న పాప ఇంప్రెస్ చేసింది. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

సాంకేతికవర్గం పనితీరు :

భరత్ వ్యాస్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలమని చెప్పొచ్చు. వర్మ సినిమాల్లో కెమెరా వర్క్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆఫీసర్ లో కూడా సినిమాటోగ్రఫీ బాగుంది. రవి శంకర్ మ్యూజిక్ పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చాడు. ఇక కథ, కథనాలు ఆర్జివి కాస్త బాగా వర్క్ అవుట్ చేసినట్టు అనిపిస్తుంది. మంచి కథ.. దానికి తగినట్టుగా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఈసారి వర్మ తన సత్తా చాటాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.

విశ్లేషణ :

ఆర్జివి, నాగ్ కాంబినేషన్ లో శివ సినిమా అప్పట్లో సెన్సేషన్.. పాతికేళ్ల తర్వాత ఆ అంచనాలను అందుకుంటారా అన్న డౌట్ ఉంది. అసలే వర్మ ఏమాత్రం ఫాంలో లేడు. అయినా ఆఫీసర్ సినిమా మళ్లీ ఇద్దరి కాంబినేషన్ లో ఉన్న కిక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథతో వచ్చిన ఆఫీసర్ సినిమా మరోసారి వర్మలోని టాలెంట్ ను చూపించేలా చేసింది.

ఈ సినిమాకు ప్రధాన బలమ స్క్రీన్ ప్లే.. కథ కూడా రొటీన్ గా కాకుండా కొత్తగా ఉంది. రన్ టైం కూడా 124 నిమిషాలే కావడంతో చాలా త్వరగానే ముగించినట్టు అవుతుంది. చాలా తెలివిగా కథనం సాగించాడు వర్మ. సినిమా కథ, కథనాల మీద అంత నమ్మకం ఉంది కాబట్టే.. కచ్చితంగా హిట్ కొడతాం అని ముందే చెప్పాడు వర్మ.

నాగార్జునతో తను సినిమా తీస్తే ఎలాంటి అంచనాలతో ఆడియెన్స్ వస్తారో ఆ అంచనాలను నిలబెట్టేలా ఉంది ఈ సినిమా. అక్కడక్కడ కాస్త ట్రాక్ తప్పినట్టు అనిపించినా మళ్లీ సెట్ రైట్ చేశాడు. క్లైమాక్స్ కూడా బాగుంది. ఓవరాల్ గా వర్మ, నాగ్ ల కాంబినేషన్ మరోసారి ఓ మంచి ప్రొడక్ట్ బయటకు వచ్చిందని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్ :

నాగార్జున నటన

స్క్రీన్ ప్లే

మ్యూజిక్

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడ ల్యాగ్ అవడం

ఎంటర్టైన్మెంట్ మిస్సింగ్

బాటం లైన్ :

నాగ్, వర్మల ఆఫీసర్.. అంచనాలను నిలబెట్టింది..!

రేటింగ్ : 3/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news