Gossipsసిఎం మహేష్ రికార్డులు మొదలయ్యాయి.. ఇక అందరు తప్పుకోవాల్సిందే..!

సిఎం మహేష్ రికార్డులు మొదలయ్యాయి.. ఇక అందరు తప్పుకోవాల్సిందే..!

సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు భరత్ అనే నేను టైటిల్ పరిశీలణలో ఉంది. ప్రస్తుతం షూటింగ్ సాఫీగా సాగుతున్న ఈ సినిమా రికార్డులు అప్పుడే మొదలు పెట్టింది. సినిమా శాటిలైట్ బిజినెస్ భారీ రేంజ్ లో జరిగిందట. స్టార్ మా వాళ్లు తెలుగు హింది శాటిలైట్ రైట్స్ కలిసి 39 కోట్లకు ఈ సినిమాను కొనేశారట.
తెలుగు వర్షన్ కు 23 కోట్లు.. హింది వర్షన్ కు 16 కోట్లు పెట్టారని టాక్. అంతేకాదు సినిమా బడ్జెట్ లో 70 శాతం బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. డిజిటల్ రైట్స్ కూడా అమేజాన్ ప్రైం కొనేసిందని టాక్. శ్రీమంతుడు తర్వాత మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో మహేష్ సిఎంగా నటిస్తున్నాడు. కమర్షియల్ సినిమాలే అయినా తీసే ప్రతి సినిమాలో చిన్నపాటి మెసేజ్ ఉండేలా చూసుకుంటున్న కొరటాల శివ ఈ సినిమాతో కూడా మహేష్ తో మంచి మెసేజ్ ఇస్తున్నాడట.
బ్రహ్మోత్సవం, స్పైడర్ ఫ్లాపులతో చేస్తున్న సినిమా మీద మహేష్ ఎక్కువ దృష్టి పెడుతున్నాడట. ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టి మరోసారి తన సత్తా ఏంటన్నది చూపించాలని చూస్తున్నాడు. 70 శాతం మాత్రమే షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా బిజినెస్ రికార్డులు మొదలయ్యాయి. మరి సినిమా ఆఫ్టర్ రిలీజ్ ఈ రికార్డులను కంటిన్యూ చేస్తుందని ఆశించవచ్చు.http://www.telugulives.com/telugu/details-abount-agnathavasi-collections/

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news