అజ్ఞాతవాసికి అడ్డంగా బుక్ అయిన దిల్ రాజు.. ఎంత లాస్ తెలిస్తే షాక్ అవుతారు..!

పవన్ త్రివిక్రం సినిమా అనగానే కాంబినేషన్ సూపర్ హిట్ కాబట్టి సినిమా కూడా మరో సంచలనం సృష్టించడం ఖాయమని అనుకున్నారు. కాని సినిమా అంచనాలను అందుకోకపోగా సినిమా కొన్న బయ్యర్లను ఇబ్బందుల పాలు చేసింది. ముఖ్యంగా నైజాం లో పవన్ రేంజ్ ఏంటో తెలిసేలా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగగా సినిమా కలక్షన్స్ మాత్రం డీలా పడ్డాయి.
అజ్ఞాతవాసి సినిమాను దిల్ రాజు 29 కోట్లకు కొనగా.. ఇప్పటిదాకా కేవలం 11 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టిందని తెలుస్తుంది. ఈ లెక్కన చూస్తే దిల్ రాజుకి అజ్ఞాతవాసి 18 కోట్ల పైనే కష్టాలు వచ్చాయని అంటున్నారు. లాస్ట్ ఇయర్ 6 సినిమాలు 6 బంతులు 6 సిక్సులు అంటూ హిట్ల లెక్క చెప్పిన దిల్ రాజు ఈ ఇయర్ మొదట్లోనే అజ్ఞాతవాసి రూపంలో దిమ్మతిరిగిపోయే షాక్ తగిలింది.
ముఖ్యంగా సినిమాకు నైట్ షోలు పర్మిషన్ ఇచ్చినా అవి లేట్ అవడంతో కొంత డ్యామేజ్ జరిగింది. చాలా చోట్ల టికెట్ రేటు పెంచినా సరే దిల్ రాజుకి అజ్ఞాతవాసి నష్టాలు తప్పేలా లేవు. స్టార్ సినిమా అనగానే సినిమా పక్కా హిట్ అన్న ఆలోచనతో డిస్ట్రిబ్యూటర్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ తో భారీ రేటు అప్పచెబుతారు. ఇక సినిమా డీలా పడితేనే అసలు లెక్క ఏంటన్నది తెలుస్తుంది.

Leave a comment