జవాన్ సినిమాలో తారక్.. ఫ్యాన్స్ హడావుడి అందుకేనా ..?

తెలుగు సినీ ఇండ్రస్ట్రీలో ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న హీరో ఎవరన్నా ఉన్నారా అంటే అది కేవలం నందమూరి హీరో జూనియర్ ఏన్టీఆర్ మాత్రమే. టాలీవుడ్ లో ఈ యంగ్ హీరోకి ఉన్న క్రేజ్ అంత ఇంతా కాధు. జూనియర్జ కి సంభందించి ఏ చిన్న వార్త బయటకి వచ్చినా ఆది పెద్ద సంచలనమే అవుతుంది. తాజాగా జూనియర్ మీద ఒక సెన్సేషనల్ వార్త హడావుడి చేస్తోంది. జూనియర్ ఓ మల్టీ స్టార్ సినిమాలో నటించడంటూ పుకార్లు బయలుదేరాయి.

ఇంతకీ విషాయం ఏంటంటే.. జవాన్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నదంటూ పుకార్లు షికార్లు చేసాయి. ఈ వార్త మెగా అభిమానులతోపాటు, నందమూరి అభిమానులను సైతం సంతోషపెట్టింది. ఇంతకీ విషయం ఏంటంటే జవాన్ సినిమా షూటింగ్ తారక్ చేతుల మీదుగా ప్రారంభం అయ్యింది . అయితే అప్పటి నుంచి ఈ సినిమా , తారక్ కు ఎదో సంబంధ ఉందంటూ ఒకటే వార్తలు.

జవాన్ సినిమా షూటింగ్ కి తారక్ క్లాప్ కొట్టడంతో దానికి కృతజ్ఞతగా ఆ చిత్ర యూనిట్ ఎన్టీఆర్ కి స్పెషల్ థాంక్స్ చెప్తూ తేరా మీద పేరు వేసింది. మెగా హీరో సినిమాలో నందమూరి హీరో పేరు చూసేటప్పటికి ఇరువురి హీరోల ఫ్యాన్స్ ఇక ఆగుతారా ఏంటి థియేటర్లో ఒకటే హాదేవుడి చేస్తూ సందడి చేసేస్తున్నారు. అదన్నమాట సంగతి.

Leave a comment