ఎవడు మిగిలాడు ? ఎవడు పోయాడు ?

ఎప్పుడూ రొటీన్ కథలతో ముందుకు వెళ్తే గొప్పతనం ఏముంటుంది అనుకున్నారో ఏమో కానీ ఈ మధ్య కాలంలో మన హీరోలు ఈ మధ్య వైవిధ్యమైన కధలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దీనికి డబ్బింగ్ సినిమాల ప్రభావం కూడా ఒక కామరణమే. ఎందుకంటే తమిళ్, కన్నడ, మలయాళం హీరోల గురించి తెలుసుకుంటే అక్కడ హీరోలు మన తెలుగు హీరోల్లా స్టార్ స్టేటస్ కోరుకోరు . పాత్ర ఎంత మాస్ అయినా వారు లెక్కచేయరు.

స్టార్ ఇమేజ్ లు అసలే పట్టించుకోకుండా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తుంటారు. దాంతో అక్కడ హీరో ల సినిమాలకు తెలుగులోనూ మంచి మార్కెట్ సంపాదించుకుంటున్నారు. అలాగే ఈ మాధ్యకాలంలో హీరోల మధ్య్య ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడడంతో మల్టీ స్టార్ సినిమాలు కూడా జోరందుకున్నాయి. ఇక ఈ సంగతి పక్కన పెడితే ఈ మధ్య విడుదల అయిన ఆక్సీజన్, ఇంద్రసేనా, జవాన్ సినిమా సంగతులు చూద్దాం !
గోపీచంద్ కెరియర్ కి అంది అందనట్లుగా ‘ఆక్సీజన్’.. !

గోపీ చంద్ కెరియర్ మొత్తం అనేక ట్విస్ట్ లుగా సాగుతోంది. మొదట హీరోగా, ఆ తరువాత విలన్ గా మళ్ళీ హీరోగా సినిమాలు చేస్తున్న గోపీచంద్ కి ఆక్సీజన్ సినిమా కొంచెం ప్రాణం పోసినట్లే కనిపిస్తోంది. ఈ సినిమా విడుదల అయ్యే అంత వరకు అనేక డేట్ లు మారుతూ వచ్చింది. ఎన్నో ప్లాప్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్న జ్యోతి కృష్ణ చాలా కాలం గ్యాప్ తరువాత ఈ సినిమాను తెరకెక్కించాడు. కానీ ఈ సినిమా రొటీన్ తెలుగు స్టోరీ తో తెరకెక్కింది. మంచి పాయింట్ తో దర్శకుడు జ్యోతికృష్ణ సినిమాను మొదలు పెట్టాడు. కానీ మొదటి భాగం ఉసూరుమనిపించింది. కానీ సినిమా కథ సాగుతున్న కొద్ది గాడి తప్పి మరోలా మారింది. కానీ ఉన్నంతలో గోపీచంద్ ఆకట్టుకోగా అను ఎమాన్యుఏల్ మరియు రాశిఖన్నా లు మెప్పించారు. మిగిలిన నటీనటులు ఫర్వాలేదు అనిపించుకున్నారు.
క్లారిటీ మిస్సయిన ఇంద్రసేన …

బిచ్చగాడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని నటించిన తాజా చిత్రం ఇంద్రసేన. ఈ చిత్రాన్ని ఫాతీమా విజయ్ ఆంటోని, నటి రాధికా శరత్ కుమార్ సంయుక్తంగా విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఆర్ స్టూడియో బ్యానర్‌పై రూపొందించారు. ఈ సినిమాలో విజయ్ అంథోని ద్విపాత్రాభినయంతో తెరమీదకు వచ్చాడు.

ఇద్దరు అన్నదమ్ముల జీవితంలో ప్రతికూల పరిస్థితులు చోటుచేసుకొన్న కారణంగా వారు పడిన సంఘర్షణ ఏమిటి?, వాటిని వారు ఎలా ఎదుర్కొన్నారు. అందుకు వారు జీవితంలో ఏం త్యాగం చేశారు అనే అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. విజయ్ ఆంటోని యాక్టింగ్ బలంగా, ఎమోషనల్ కంటెంట్‌తో తెరకెక్కిన చిత్రం ఇంద్రసేన. సెకండాఫ్‌లో కథ నడిచే తీరు, క్యారెక్టర్లలో సరైన క్లారిటీ కనిపించదు. ఇక హీరోయిన్ల గ్లామర్ గురించి చెప్పాలంటే అంతంతా మాత్రమే.

ఈ సినిమాలో హాస్యం అనేది అస్సలు కనిపించదు. ఓవర్ ఆల్ గా చెప్పాలంటే ఈ సినిమాలో అంతా తమిళ వాతావరణమే కనిపిస్తుంది. విజయ్ అంథోని సినిమా అని భారీ అంచనాలు పెట్టుకున్న వారికీ మాత్రం ఈ సినిమా నిరాశే కలిగిస్తుంది. మొత్తంగా దర్శకుడు శ్రీనివాసన్ ఎంచుకొన్న కథ బాగానే అనిపిస్తుంది.కానీ సినిమా తీయడంలోనే కొంచెం గందరగోళం కి గురైనట్లు స్ప్రష్టంగా కనిపిస్తోంది.

జవాన్ ఫర్వాలేదు కానీ…

కెరియర్లో గుర్తుండిపోయే హిట్ సాధించి స‌క్సెస్ ట్రాక్‌లోకి రావాల‌నుకున్న సాయిధ‌ర‌మ్ తేజ్ తాజాగా చేసిన చిత్రమే `జ‌వాన్‌`.గతంలో `వాంటెడ్` అనే ప్లాప్ సినిమాను డైరెక్ట్ చేసిన ర‌చ‌యిత బి.వి.ఎస్‌.ర‌వికి త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా అవ‌కాశాలు రాలేదు. ఆ తరువాత ద‌ర్శ‌కుడిగా నిరూపించుకునే ప్ర‌య‌త్నంలో భాగంగా ఇతడు జ‌వాన్ సినిమాను తెక‌రెక్కించాడు బి.వి.ఎస్‌.ర‌వి. దేశం ప‌ట్ల బాధ్య‌త గ‌ల ఓ యువ‌కుడు దేశం కోసం, త‌న కుంటుంబం కోసం ఏం చేశాడ‌నేదే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమే జవాన్.

నేను, నా కుటుంబం, నా దేశం అనుకునే క‌థానాయ‌కుడికి, నేను మాత్ర‌మే అనుకునే ప్ర‌తి నాయ‌కుడికి మ‌ధ్య జ‌రిగే పోరే జ‌వాన్‌. ఇద్ద‌రు వ్య‌క్తులు పొట్లాడుకోవ‌డం కాకుండా సినిమాను మైండ్ గేమ్ స్టైల్లో తెరెకెక్కించాడు ద‌ర్శ‌కుడు బి.వి.ఎస్‌.ర‌వి. క‌థ‌ను చెప్పాల‌నుకున్న క్ర‌మం, ఎంచుకున్న డి.ఆర్‌.డి.ఒ బ్యాక్‌డ్రాప్ బావున్నా, సినిమాలో ఏదో హ‌డావుడి తెర‌పై బాగానే క‌న‌ప‌డింది. ఇది కాస్త ప్రేక్ష‌కుడిని అయోమయంలో పడేస్తుంది.

ఒక కుటుంబం నాశనం అయితే దేశానికి ఏం కాదు..కానీ దేశానికి ఏదైనా జ‌రిగితే చాలా కుటుంబాలు నాశనం అవుతాయి. దేశ ర‌క్ష‌ణ‌ అనేది ప్ర‌తి ఒక్క‌డి ల‌క్ష్యం కావాలి..మ‌న‌కు ఒక‌టి ద‌క్క‌లేదంటే దాన్ని మించిందేదో మ‌న కోసం వెయిట్ చేస్తుంద‌ని అర్థం అనే సంభాష‌ణ‌లు బావున్నాయి. అలాగే ప్రీ క్లైమాక్స్‌లో త‌న కుంటుంబంలో త‌ను, త‌న తండ్రి ఫెయిల్యూర్, కుటుంబ‌ అంటూనే వారెలా స‌క్సెసో చెప్పే స‌న్నివేశం ప్రేక్షకుల‌ను మెప్పిస్తుంది.

మొత్తానికి ఈ సినిమా పర్వలేదు అనిపించుకుంది. ఈ సినిమాలో సాయిధర్మతేజ్ యాక్షన్ బాగా ఆకట్టుకుంది. మొత్తానికి ఈ సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. బి.వి.ఎస్.రవి రచయితగా దర్శకుడిగా యావరేజ్ మార్కులు వేయించుకుంటాడు. అతను ఎంచుకున్న కథ ఓకే. హీరో పాత్రను బాగా తీర్చిదిద్దగలిగాడు.

Leave a comment