ఎన్టీఆర్ రమ్మంటే… గుద్ది చంపుతా అని రఘు సీరియస్ ..?

తమ రేటింగ్స్ కోసం .. యాడ్స్ కోసం సినిమా వాళ్లకు సంబందించిన గాసిప్స్ వార్తలు రాసెయ్యడం ఈ మధ్య బాగా ఎక్కువయిపోయాయి. ఈ వార్తల వల్ల వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్ కి ఎంత నష్టం జరుగుతుందో అనే మాత్రం ఎవరూ ఆలోచించడంలేదు. సోషల్ మీడియా వాడకం ఎక్కువ అయ్యాక ఏది నిజమో..? ఏది అబద్దమో తెలియని అయోమయ పరిస్థితి తలెత్తుతోంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే కమెడియన్ రఘు విషయంలోనూ జరిగింది. దీంతో ఆయన అగ్గిమీద గుగ్గిలం అయిపోతున్నాడు. అసలు ఏమైంది..? రఘు కోపానికి కారణం ఏంటి ..? తెలుసుకుందాం. !

రొటీన్ గా కాకుండా డిఫ్రెంట్ స్టైల్లో .. అందరిని ఆకట్టుకునేలా తనం మ్యానరిజాన్ని ప్రదర్శిస్తూ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎక్కువగా తారక్ సినిమాల్లో కనిపించే ఇతగాడు ఎన్టీఆర్ ఆది సినిమాలో నటించాడు ఇక అక్కడి నుంచి ఎన్టీఆర్ నడిచిన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక పాత్రలో కనిపించడం పరిపాటిగా మారింది. ఎన్టీఆర్ కి కూడా రఘు అంటే ఎంతో అభిమానం. ఇటీవల రఘు ఓ యూట్యూబ్ చానెల్‌ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలోని వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను పంచుకున్నాడు.

ఓ వెబ్ ఛానెల్ లో వచ్చిన ఒక వార్త రఘుకి బాగా కోపం తెప్పించింది అట. అందులోని సారాంశం ఏంటంటే.. రఘు కూతురిని జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి తీసుకురమ్మన్నట్టు వార్త ఇష్టం వచ్చినట్టు రాసిపడేశారట. ఆ వార్త చుసిన వెంటనే రఘు కి ఆగ్రహం కట్టలు తెంచుకుందట. రాసిన వ్యక్తి కనుక ఎదురుగా కనిపిస్తే అతగాడిని చంపెయ్యాలనే అంత కోపం వచ్చింది అని రఘు చెప్తున్నాడు. ఇలా వారి వార్త కోసం ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారు వాళ్ళు కనుక మళ్ళీ నాకు కనిపిస్తే గుద్ది గుద్ది చంపెద్దును అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు రఘు. అవును ఏమాత్రం ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు వార్తలు వేసేస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారు..?

Leave a comment