చైతుకి ఇష్టం లేకుండా సమంత..!

హీరోయిన్ గా సమంత రేంజ్ ఏంటో అందరికి తెలిసిందే.. అక్కినేని నాగ చైతన్యతో ప్రేమలో పడి ఈమధ్యనే ఇద్దరు పెళ్లిచేసుకున్నారనుకోండి. కెరియర్ లో తనకు తానుగా టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ వచ్చిన సమంత నిన్న వచ్చిన రాజు గారి గది-2లో సర్ ప్రైజ్ రోల్ లో కనిపించింది. సమంత ఇమేజ్ కు తగ్గ పాత్ర అయితే కాదు కాని ఎందుకు ఆ పాత్ర చేసిందో అని అభిమానులు అనుకుంటున్నారు.

అయితే సినిమాలో నాగార్జున చేయడం.. రొటీన్ సినిమాలకు భిన్నంగా నటించాలనే ఆలోచనతో సమంత ఆ పాత్ర ఒప్పుకుందట. సమంత ఆ పాత్ర చేయడం మాత్రం అటు నాగ చైతన్యకు, ఇటు మరిది అఖిల్ కు ఏమాత్రం ఇష్టం లేదట. వారిద్దరికి ఇష్టం లేకుండానే ఒప్పేసుకుని సినిమా చేసిందట సమంత. మొత్తానికి తనకు ఎలాంటి పాత్ర ఇచ్చినా సరే దానిలో పరకాయ ప్రవేశం చేయడమే అన్నట్టు సమంత పర్ఫార్మెన్స్ అదరగొడుతుంది.

రిలీజ్ అయిన రాజు గారి గది-2లో కూడా సమంత పర్ఫార్మెన్స్ కు మంచి మార్కులే పడుతున్నాయి. అయితే ఎమోషనల్ టచ్ ఎక్కువయ్యిందన్న భావనలో ప్రేక్షకులు ఉన్నారు కాని సినిమా గట్టేక్కేస్తుందనే ట్రెడ్ వర్గాల టాక్.