ప్రభాస్ తో వైరస్.. తస్మాత్ జాగ్రత్త..!

డార్లింగ్ ప్ర‌భాస్ తో జాగ్ర‌త్త‌.. అలానే భ‌ళ్లాళ దేవుడు రానాతోనూ జాగ్ర‌త్త‌.. మీరు తెలిసో తెలియ‌క‌నో వీరి పేర్లు గూగుల్ లో సెర్చ్ చేశారో అనుకోండి మీర సైబ‌ర్ ఎటాక్ బారిన ప‌డ‌డం, హానికర వైర‌స్ మీ కంప్యూట‌ర్ లోకి చొర‌బ‌డ‌డం ఖాయమ‌ని మెకాఫే అనే సంస్థ హెచ్చ‌రిస్తోంది. అదే విధంగా బీ టౌన్‌లో క‌పిల్ శ‌ర్మ‌, కోలీవుడ్ సీనియర్ నటుడు ప్రభుతో చాలా ప్రమాదమని ఈ ప్రపంచ స్థాయి సైబర్‌ సెక్యూరిటీ సంస్థ  అంద‌రినీ అప్ర‌మ‌త్తం చేస్తోంది.  సెలబ్రిటీల పేర్లతో సెర్చ్ ఇంజన్ లో ఎంతవరకు సురక్షితం అన్నదానిపై ఏటా మెకాఫే అధ్యయనం చేసి ర్యాంకులు ఇస్తుంది.

ఈ ఏడాది సెర్చ్ ఇంజిన్‌లో అత్యంత ప్రమాదకరమైన దక్షిణాది నటుడిగా సీనియర్ నటుడు ప్రభు తొలిస్థానంలో నిలిచాడని మెకాఫే తెలిపింది. ఆ తరువాతి స్థానాల్లో ప్రభాస్, రానా దగ్గుబాటి నిలవడం విశేషం.దేశవ్యాప్తంగా చేసిన సెర్చ్‌లో హిందీ టీవీ కమేడియన్ కపిల్ శర్మ తొలిస్థానంలో నిలిచాడు. కపిల్ శర్మ పేరుతో సెర్చ్ ఇంజిన్ లో వెతికితే 9.58 శాతం హానికర వెబ్‌ సైట్స్‌ ఓపెన్ అవుతున్నాయని మెకాఫే వెల్లడించింది.

2016 సర్వేలో బాలీవుడ్ బొద్దుగుమ్మ సోనాక్షీ సిన్హా మొదటి స్థానంలో నిలవగా, ఆమె స్థానాన్ని ఈ ఏడాది కపిల్ శర్మ ఆక్రమించాడు. అతడి తరువాత సల్మాన్, ఆమీర్ ఖాన్‌లు, 8.5శాతంతో ప్రియాంకా చోప్రా ఉన్నట్లు ఆ సంస్థ  తెలిపింది. గత ఏడాది ఏడోస్థానంలో ఉన్న ప్రియాంక ప్రస్తుతం నాలుగో ర్యాంకులో ఉండ‌డం గ‌మ‌నార్హం. సో,, గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లోప్ర‌భాస్ రానా పేర్లు వెతికేట‌ప్పుడు నెటిజ‌నులారా!!! బీ కేర్ ఫుల్‌!! బీ వేర్ ఆఫ్ వైర‌స్‌. టేక్ ఎ ప్రివెన్ష‌న్ ఫ‌ర్ దిస్‌.

Leave a comment