Moviesశర్వానంద్ హీరోయిన్ తో...నాని పేకాట...?

శర్వానంద్ హీరోయిన్ తో…నాని పేకాట…?

నిన్ను కోరి ఫేమ్ నేచురల్‌ స్టార్‌ నాని తన తరవాతి చిత్రానికి సన్నద్ధం అయ్యాడు…ఆ సినిమాలో తనకి జోడీగా మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తోంది అని టాలీవుడ్‌ వర్గాల్లో చర్చ. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని నటిస్తున్న ఈ సినిమాకి అనుపమ పరమేశ్వరన్‌ను ఎంపికచేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు చేసిన శతమానం భవతి లో సంప్రదాయబద్ధమైన పాత్రలు, దుస్తుల్లో కనిపించిన అనుపమ నాని సినిమాలో మాత్రం కాస్త మోడ్రన్‌ రోల్‌లో ప్రేక్షకులను రంజింప్ప చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రామ్‌కి జోడీగా ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రంలో అనుపమ నటిస్తున్నారు. ‘శతమానం భవతి’ చిత్రం తర్వాత అనుపమకి తెలుగుతో పాటు తమిళంలోనూ అవకాశాలు బాగానే వస్తున్నాయి. నాని, మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం తొలి షెడ్యూల్‌ యూరప్‌లో జరగనున్నట్లు సమాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news