Moviesఎన్టీఆర్ బయోపిక్ డైరక్టర్ ఫిక్స్.. బాలయ్య బయటపెట్టిన టాప్ సీక్రెట్..!

ఎన్టీఆర్ బయోపిక్ డైరక్టర్ ఫిక్స్.. బాలయ్య బయటపెట్టిన టాప్ సీక్రెట్..!

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించాలన్న ఆలోచన బాలయ్యకు వచ్చింది. సినిమా ఎనౌన్స్ చేసి ఇన్నాళ్లు అవుతున్నా ఎన్.టి.ఆర్ బయోపిక్ పై బాలయ్య నోరు తెరచింది లేదు. అయితే రేపు రిలీజ్ అవుతున్న పైసా వసూల్ ప్రమోషన్స్ లో భాగంగా బాలకృష్ణ ఎన్.టి.ఆర్ బయోపిక్ పై స్పందించారు.

ఎన్.టి.ఆర్ బయోపిక్ తెరకెక్కించడం జరుగుతుందని ఇక ఆ సినిమా దర్శకుడు ఎవరన్నది మరో రెండు రోజుల్లో వెళ్లడిస్తానని అన్నారు. సెప్టెంబర్ 1న పైసా వసూల్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా హిట్ టాక్ వస్తే ఎన్.టి.ఆర్ బయోపిక్ ను దర్శకుడు పూరి జగన్నాథ్ చేతుల్లో పెట్టే ఆలోచనలో ఉన్నాడట బాలకృష్ణ.

ఇక ఎన్.టి.ఆర్ జీవితంలో జరిగిన మిగతా సంఘటనలను చెన్నైలో కొంతమంది దగ్గర అడిగి తెలుసుకున్నామని.. ఇక గుడివాడలో కూడా ఎన్.టి.ఆర్ సన్నిహితుల దగ్గర నుండి సమాచారం తెలుసుకున్నారట. సిని రాజకీయ రంగాలలో ప్రక్షాళన చేసిన ఎన్.టి.ఆర్ బయోపిక్ ఏ దర్శకుడి చేతిలో పడుతుంది అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news