Moviesనెగటివ్ రోల్ లో నాని.. కొత్త ప్రయోగం ఎలా ఉంటుందో..!

నెగటివ్ రోల్ లో నాని.. కొత్త ప్రయోగం ఎలా ఉంటుందో..!

నాచురల్ స్టార్ నాని నిన్ను కోరి తర్వాత చేస్తున్న ఎం.సి.ఏ మూవీ ఆల్రెడీ సెట్స్ మీద ఉంది. వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఫిదాలో భానుమతిగా అలరించిన సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత నాని చేస్తున్న మూవీ కృష్ణార్జున యుద్ధం.
మేర్లపాక గాంధి డైరక్షన్ లో నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో ఒక పాత్ర విలన్ రోల్ అని తెలుస్తుంది.

ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో నాని అదరగొట్టేస్తాడట. ఇప్పటికే జెండా పై కపిరాజు, జెంటిల్ మన్ సినిమాలలో డ్యుయల్ రోల్స్ చేసిన నాని ఈసారి కొత్తగా పూర్తిస్థాయి విలన్ గా కనిపించనున్నాడట. నెగటివ్ రోల్ లో నాని కచ్చితంగా ఫ్యాన్స్ కు పండుగే అయితే వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి కామెడీ ఎంటర్టైన్ సినిమాలతో హిట్ అందుకున్న దర్శకుడు మేర్లపాక గాంధి కమర్షియల్ పంథాలో తెరకెక్కించే ఈ కృష్ణార్జున యుద్ధంతో సినిమా ఎలా తీస్తాడో అని గుస గుసలాడుతున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్ళే ఈ సినిమా 2018 మొదట్లో రిలీజ్ అవుతుందట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news