Moviesపొట్టకోసినా అబద్దమే చెప్తా...లై అంటేనే నితిన్... (వీడియో).

పొట్టకోసినా అబద్దమే చెప్తా…లై అంటేనే నితిన్… (వీడియో).

నితిన్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘లై’ ఈ సినిమాలో మేఘ ఆకాష్ హీరోయిన్.వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మాతలు.మణిశర్మ ఈ సినిమాకి సంగీత దర్శకుడు.ఈ సినిమా ప్రీ-రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా థియేట్రికల్‌ ట్రైలర్‌ను సుకుమార్ లాంచ్ చేయగా, ఆడియోను త్రివిక్రమ్‌ లాంచ్‌ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

వివరాల్లోకి వెళ్తే….

హీరో గారి పేరు “ఏ.సత్యం”. మాములుగా అయితే ఆ మాటను “అసత్యం”గా పలుకుతారు. పొట్టకొసినా, భగవద్గీత మీద ఒట్టు వేసినా అబద్ధమే చెప్తాను. నిజం చచ్చినా చెప్పను’ అంటున్న నితిన్‌. ఆయన నటించిన తాజా చిత్రం ‘లై’..అబద్ధాల చుట్టూ ఈ సినిమా తిరుగుతున్నట్టు సినిమా ట్రైలర్‌ చూసిన ఎవరు అయినా చెప్పవచ్చు. ఎందుకంటే.. ‘మనం అబద్ధాలే మాట్లాడుకుందాం. అర్థమైందా?’ అని హీరోయిన్‌ అనగానే .. ‘నువ్వు పెద్ద బాగోవు.. బాగా యావరేజ్’ అని హీరో సమాధానం చెప్తాడు.. ఇక ‘అబద్ధాలకు కూడా అమ్మాయిలు పడిపోతారని ఫస్ట్‌ టైమ్‌ తెలిసింది’ అని హీరోయిన్‌ సిగ్గుపడుతూ చెప్పగా .. ‘అసలు అమ్మాయిలు పడేదే అబద్ధానికి.. పాపం అమాయకపు అమ్మాయిలు..’ అంటూ హీరో తన డిఫరెంట్ వాయిస్‌లో చెప్తాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news