Moviesజై లవకుశ నుండి మరో సంచలనం.. మరో పాత్ర రివీల్ చేసున్నారు..!

జై లవకుశ నుండి మరో సంచలనం.. మరో పాత్ర రివీల్ చేసున్నారు..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబి కాంబినేషన్ లో వస్తున్న సినిమా జై లవకుశ. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమా నుండి వచ్చిన మొదటి టీజర్ జై పాత్రతో సృష్టించిన సంచలనాలు తెలిసిందే. టీజర్ తో రికార్డుల లెక్క తేల్చిన తారక్ ఈసారి మరో పాత్ర లవ కుమార్ టీజర్ రిలీజ్ చేయబోతున్నారట. ఇక ఆ లుక్ ఎప్పుడు ఆ టీజర్ విశేషాలకు సంబందించిన విషయాలను రేపు ఉదయం 10 గంటలకు తెలియచేస్తారని ఎన్టీఆర్ బ్యానర్ అఫీషియల్ ట్వీట్ లో తెలిపారు.

జై గా రావణ రాక్షసత్వం చూపించిన తారక్ లవ కుమార్ గా ఎలా ఉంటాడో అని ఫ్యాన్స్ లో ఓ ఎక్సయిట్మెంట్ మొదలైంది. జై పాత్రతోనే సినిమా హిట్ అని భావిస్తున్న ఫ్యాన్స్ అంచనాలను ఇంకాస్త పెంచేందుకు మిగతా పాత్రలను రిలీజ్ చేస్తున్నాడు డైరక్టర్ బాబి. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో తారక్ మూడు డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాడు. రాశి ఖన్నా, నివేథా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 21న రిలీజ్ అవబోతుంది. మరి సంచలనాలకు కేంద్రంగా మారుతున్న ఈ జై లవకుశతో తారక్ ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తాడో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news