Moviesరాజమౌళి గర్వపడేలా చేసిన సైరా నరసింహారెడ్డి..!

రాజమౌళి గర్వపడేలా చేసిన సైరా నరసింహారెడ్డి..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా సైరా నరసింహారెడ్డి టైటిల్ లోగో మోషన్ పోస్టర్ నిన్న చిరు బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. బాహుబలితో దర్శకుడిగా తన సత్తా చాటిన రాజమౌళి చేతుల మీదుగా ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ రిలీజ్ గురించి ట్వీట్ చేసిన రాజమౌళి ఇది తనకు గర్వ కారణమని పర్ఫెక్ట్ కాస్ట్ అండ్ క్రూతో వస్తున్న సైరా నరసింహారెడ్డి టీం అందరికి బెస్ట్ విషెష్ తెలిపారు రాజమౌళి.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ తోనే ఓ ప్రభంజనం సృష్టించింది. ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో నయనతార, బిగ్ బీ అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి లీడ్ రోల్స్ చేస్తున్నారు. బాహుబలికి ధీటుగా మళ్లీ మన తెలుగు పరిశ్రమ నుండే రాబోతున్న ఈ సినిమా తప్పకుండా ఆ సినిమా రేంజ్ అందుకుంటుందని చెప్పొచ్చు.

స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమా కథను పరుచూరి సోదరులు అందిస్తున్నారు. మోషన్ పోస్టర్ తోనే సినిమాతో అంచనాలు పెంచిన సురేందర్ రెడ్డి తప్పకుండా మెగా అభిమానులు మీసం మెలెసేలా సినిమా తీస్తాడని చెప్పుకోవచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news