Moviesలెక్క చెప్పిమరి వస్తున్న బన్ని.. బాక్సాఫీస్ బద్ధలవ్వాల్సిన రోజదే..!

లెక్క చెప్పిమరి వస్తున్న బన్ని.. బాక్సాఫీస్ బద్ధలవ్వాల్సిన రోజదే..!

సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా దువ్వాడ జగన్నాధం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ సినిమాతో కూడా హిట్ మేనియా కంటిన్యూ చేసిన బన్ని ప్రస్తుతం రచయితగా సక్సెస్ ఫుల్ సినిమాలను తీసిన వక్కంతం వంశీ డైరక్షన్ లో నా పేరు సూర్య సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా ముహుర్తం పెట్టుకున్న ఈ సినిమా ఈరోజు నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. స్టార్ట్ అవడమే కాదు 2018 ఏప్రిల్ 27న రిలీజ్ అని ఫిక్స్ చేశారట కూడా. లెక్క చెప్పిమరి ఆ టైం వస్తా అని బన్ని బల్ల గుద్ది చెబుతున్నాడు.

బన్ని సినిమా అంటే బాక్సులు బద్ధలవ్వాల్సిందే.. సినిమాకో రేంజ్ అందుకుంటున్న స్టైలిష్ స్టార్ నా పేరు సూర్య కచ్చితంగా కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని అంటున్నారు. అను ఎమాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్నారు. మెగా బ్రదర్ నాగ బాబు కూడా సినిమా నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు. మరి సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకున్న బన్ని రికార్డులు టార్గెట్ పెట్టుకున్నాడని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news