Moviesఆమె ఉన్న ప్రతి సినిమా చూడండి.. హీరోయిన్ పై సమంత షాకింగ్...

ఆమె ఉన్న ప్రతి సినిమా చూడండి.. హీరోయిన్ పై సమంత షాకింగ్ కామెంట్..!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఉన్న సమంత తన తోటి నటీనటులను ఎంకరేజ్ చేయడంలో కూడా ముందుంటుంది. తన మనసుకి నచ్చిన సినిమా ఏది వచ్చినా ఆ సినిమా గురించి తను ప్రస్తావించి ఆ సినిమా ప్రమోషన్స్ కు సహాయపడుతుంది. ఇక ఇప్పుడు అలానే సమంతను ఇష్టపడేలా చేసిన సినిమా ఫిదా. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వరుణ్ తేజ్, సాయి పల్లవి కలిసి నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా సక్సెస్ ను పురస్కరించుకుని ఫిదా సంబరాలు స్టార్ట్ చేశారు. ఇక ఈ సినిమా చూసిన సమంత రిఫ్రెషింగ్ మూవీ.. మనసుకి హత్తుకునే సిన్సియర్ లవ్ చూపించిన శేఖర్ కమ్ముల, వరుణ్ తేజ్ లకు కంగ్రాట్స్ చెప్పింది. అంతేకాదు సాయి పల్లవి నటన గురించి సింపుల్ గా భానుమతి ఉన్న ప్రతి సినిమా చూసేయొచ్చు అని తన అభిమానులకు ఓ స్టేట్మెంట్ ఇచ్చేసింది.

ఓ టాప్ హీరోయిన్ గా సమంత తోటి హీరోయిన్ గురించి ఈ రేంజ్ లో రెస్పాండ్ అవడం అందరిని ఆశ్చర్యపరచింది. ఇక సమంత కామెంట్స్ కు సాయి పల్లవి కూడా చాలా గౌరవగా భావిస్తున్నాథాంక్స్ అంటూ సమంతకు కామెంట్స్ కు రిప్లై ఇచ్చింది. మొత్తానికి ఫిదా భామ సిని ప్రముఖులందరిని ఫిదా చేసేసింది. భానుమతిగా సాయి పల్లవి అభినయంలో అదరగొట్టేసిందని తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news