Moviesఆర్య-3 సుక్కు నన్ను పిచ్చి వాడిని చేస్తాడు..!

ఆర్య-3 సుక్కు నన్ను పిచ్చి వాడిని చేస్తాడు..!

సుకుమార్ అల్లు అర్జున్ ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ఆర్య సూపర్ హిట్.. అల్లు అర్జున్ ను హీరోగా నిలబెట్టిన సినిమా అది. అప్పటి నుండి ఇద్దరి మధ్య అదే అండర్ స్టాండింగ్ ఉంది. ఇక ఆర్య-2 కూడా విమర్సకుల ప్రశంసలు అందుకుంది. సుక్కు సినిమా అంటే అది కూడా అల్లు అర్జున్ తో అయితే అది ఆర్య సీక్వల్ అని ఆడియెన్స్ ఫిక్స్ అయ్యారు. అందుకే రీసెంట్ గా దర్శకుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన బన్నితో ఫ్యాన్స్ ఆర్య-3 ఎప్పుడు అని అడిగేశారు.

ఆర్యలో టిపికల్ క్యారక్టర్ కొత్తగా ఉంది.. ఆర్య-2 లో ఇంకాస్త టిపికల్ చాలా కొత్తగా అనిపించింది.. ఇక ఆర్య-3 తీస్తే అందులో తనని పిచ్చి వాడిని చేసేస్తాడు సుకుమార్ అంటున్నాడు బన్ని. ఇద్దరు కలిసి ఆర్య ఫ్లేవర్ నుండి బయటకు వచ్చి ఓ కొత్త సినిమా చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నారు కాని అది మాత్రం కుదరట్లేదు.

ఇక తనకు మగవాళ్లలో ఎవరికైనా ఐలవ్యూ చెప్పమంటే అది సుకుమార్ మాత్రమే అని సర్ ప్రైజ్ కామెంట్ చేశాడు బన్ని. సో వారిద్దరి మధ్య ఎంత మంచి సాన్నిహిత్యం ఉందో అర్ధం చేసుకోవచ్చు. సుకుమార్ నిర్మాతగా హరి ప్రసాద్ డైరక్షన్ లో వస్తున్న సినిమా దర్శకుడు ఆగష్టు 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఆడియోకి చరణ్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు బన్నిని పిలిచి సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ ఏర్పడేలా చేసుకుంటున్నాడు సుకుమార్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news