Moviesకొరటాలశివతో చరణ్.. అదిరిపోయే కాంబినేషన్ గురూ..!

కొరటాలశివతో చరణ్.. అదిరిపోయే కాంబినేషన్ గురూ..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమా 2018 సమ్మర్లో సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్టు సమాచారం. రచయితగా సూపర్ హిట్లు అందుకున్న కొరటాల శివ మిర్చితో దర్శకుడిగా మారి అదే రేంజ్ హిట్స్ అందుకుంటున్నాడు. మహేష్ తో శ్రీమంతుడు, ఎన్.టి.ఆర్ తో జనతా గ్యారేజ్ సినిమాలను తీసిన కొరటాల శివ ప్రస్తుతం మహేష్ తో భరత్ అను నేను సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా కాకముందే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో మరో సినిమా ముహుర్తం పెట్టేశాడు. తారక్ మూవీ తర్వాత చరణ్ తో ఆ వెంటనే మరో మూవీ ఫిక్స్ చేసుకున్నాడు కొరటాల శివ. వరుసగా స్టార్ హీరోల సినిమాలను తీస్తూ ఇండస్ట్రీ హిట్ కొడుతున్నాడు కొరటాల శివ. స్టార్ సినిమా అంటే మూస సినిమా అని మాట మారి కంటెంట్ ఉన్న సినిమా అనేలా చేస్తున్న కొరటాల శివతో పనిచేయడానికి స్టార్ హీరోలందరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఇక చరణ్ తో కొరటాల శివ మూవీని క్షణం, ఘాజి సినిమాలను నిర్మించిన నిరంజన్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. మాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమా సహ నిర్మతగా రాం చరణ్ ఉండటం విశేషం. కొరటాల శివతో ఎప్పటినుండో సినిమా తీయాలని చూసిన చరణ్ ఇప్పటికి ఆ కాంబో సెట్ అయ్యేలా చేశాడు. మరి రాబోతున్న ఈ క్రేజీ కాంబో ఎన్ని సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news