Newsనాని ఓ హిట్ మిషన్.. అతని దగ్గర చాలా నేర్చుకోవాలి..!

నాని ఓ హిట్ మిషన్.. అతని దగ్గర చాలా నేర్చుకోవాలి..!

వరుసగా 7 సినిమాలను విజయవంతం చేసుకున్న నాచురల్ స్టార్ నానికి ఈతరం కుర్ర హీరోల దగ్గర నుండి ప్రశంసలు అందుతున్నాయి. ఇక స్పెషల్ గా అక్కినేని వారసుడు అఖిల్ అయితే నాని ఓ హిట్ మిషన్ అని సంభోదించాడు. కంగ్రాట్స్ వన్ అండ్ ఓన్లీ నాని.. నువ్వో హిట్ మిష.. నీ నుండి చాలా నేర్చుకోవాలంటూ ట్వీట్ చేశాడు అఖిల్.

రీసెంట్ గా నాని నటించిన నిన్ను కోరి సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. శివ నిర్వాణ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమాలో నివేథా థామస్ హీరోయిన్ గా నటించింది. ఆది పినిశెట్టి కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. సినిమా చూసిన సిని పరిశ్రమకు చెందిన వారంతా నాని నటనకు ఫిదా అవుతున్నారు. అంతేకాదు నాని కథల సెలక్షన్స్ కు తిరుగులేదని కితాబు ఇస్తున్నారు.

ఆ వరుసలో యువ హీరో అఖిల్ నాని మీద ఉన్న అభిమానాన్ని ట్వీట్ ద్వారా తెలియచేశాడు. నిన్ను కోరి లాంటి సాడ్ ఎండింగ్ స్టోరీలను యాక్సెప్ట్ చేసే గట్స్ నానికి మాత్రమే ఉన్నాయని చెప్పొచ్చు. నిన్నుకోరి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నాని ప్రస్తుతం వేణు శ్రీరాం డైరక్షన్ లో ఎం.సి.ఏ సినిమా చేస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news