Moviesరెండు రోజులకి దువ్వాడ జగన్నాధం ఏరియాల వారీగా వసూళ్ల వివరాలు

రెండు రోజులకి దువ్వాడ జగన్నాధం ఏరియాల వారీగా వసూళ్ల వివరాలు

అల్లు అర్జున్ తాజా చిత్రంగా ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రం ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏ థియేటర్ దగ్గర చూసినా బన్నీ అభిమానుల సందడి ఒక రేంజ్ లో కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. బన్నీ కెరియర్ లోనే ఈ స్థాయి ఓపెనింగ్స్ రావడం ఇదే మొదటిసారి అని అంటున్నారు.

ఇక ఓవర్సీస్ లోను ‘దువ్వాడ’ దూకుడు తక్కువగా లేదు. గురువారం రోజున ప్రీమియర్ షోల ద్వారా 350000 డాలర్ల గ్రాస్ ను రాబట్టింది. ఇక శుక్రవారం రోజున 180000 డాలర్లను వసూలు చేసింది. శని .. ఆదివారాల్లో వసూళ్లు మరింతగా పెరగడం ఖాయమని చెబుతున్నారు. దగ్గర్లో బన్నీ స్థాయి హీరోల సినిమాలేవీ లేకపోవడంతో, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దూకుడును ఆపడం కష్టమేనని అంటున్నారు. కథ .. కథనాలు .. బన్నీ డిఫరెంట్ లుక్స్ .. పూజా హెగ్డే గ్లామర్ ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు తెచ్చిపెడుతున్నాయని అంటున్నారు. రెండు రోజులకి గాను ఏరియాల వారీగా తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు క్రింది విధంగా ఉన్నాయి

Nizam: రూ. 8.32 కోట్లు
Ceded రూ. 4.05 కోట్లు
UA రూ. 3.13 కోట్లు
EAST రూ. 3.06 కోట్లు
WEST రూ. 2.41 కోట్లు
Krishna రూ. 1.61 కోట్లు
Guntur రూ. 2.84 కోట్లు
Nellore రూ. 1.33 కోట్లు

Total AP/TS share రూ. 26.75 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news