Movies‘బేతాళుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ‘బిచ్చగాడు’ పుణ్యమే!

‘బేతాళుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ‘బిచ్చగాడు’ పుణ్యమే!

Vijay Antony’s latest movie Bethaludu first day collections are out and the figure is well in dubbing version. Read below article to know more details.

‘బిచ్చగాడు’తో విజయ్ ఆంటోనీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించడంతో.. సహజంగానే అతని ‘బేతాళుడు’ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఆ క్రేజ్ కారణంగానే ఈ మూవీ రూ.5 కోట్ల మేర ప్రి-రిలీజ్ బిజినెస్ చేసింది కూడా. ఇక ట్రైలర్‌తోపాటు మూవీకి సంబంధించి రిలీజ్ చేసిన తొలి పది నిముషాల వీడీయో కూడా ఆడియెన్స్‌ని ఎట్రాక్ట్ చేయడంతో.. ఈ చిత్రం క్యూరియాసిటీ మరింత పెరిగింది. దీంతో.. ఈ చిత్రం ‘బిచ్చగాడు’ తరహాలోనే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావించారు. ఆ అంచనాల్ని అందుకోవడంలో ఈ చిత్రం కాస్త సక్సెస్ అయ్యిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. తొలిరోజు ఈ సినిమా సంతృప్తికరమైన కలెక్షన్లే రాబట్టింది.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ సైకలాజికల్ చిత్రం తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ వద్ద రూ.1.6 కోట్లు కలెక్ట్ చేసింది. తొలిరోజు ఓ డబ్బింగ్ చిత్రం ఈ రేంజ్ కలెక్ట్ చేయడం విశేషమే. ఏరియాలవారీగా చూసుకుంటే.. కృష్ణాలో 12.8 లక్షలు, వెస్ట్ గోదావరిలో 8.4 లక్షలు, నెల్లూరులో 4.8 లక్షలు కలెక్ట్ చేసింది. మిగిలిన ఏరియాల కలెక్షన్స్ వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ‘బిచ్చగాడు’ పుణ్యమా అని ‘బేతాళుడు’ ఫస్ట్ డే బాగానే రాబట్టాడు. కానీ.. మిక్స్‌డ్ టాక్ రావడం వల్ల రెండోరోజు నుంచి వసూళ్లు డ్రాప్ అవుతాయని, టోటల్ రన్‌లో ‘బిచ్చగాడు’ని దాటలేడని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా.. బ్రేక్ ఈవెన్‌కి చేరుకోవడం పక్కా కాబట్టి, డిస్ట్రిబ్యూటర్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇక ఓవర్సీస్ విషయానికొస్తే.. అక్కడ ఈ చిత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది. ప్రీమియర్స్ ద్వారా కేవలం $3,139 మాత్రమే కలెక్ట్ చేయగలిగింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news