టాలీవుడ్ లో సరికొత్త ట్విస్ట్… ఈ శుక్రవారం 13 సినిమాలు

tollywood

అయితే అతి వృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టు ఉంది సినిమా ఇండ్రస్ట్రీ పని . ఎందుకంటే వస్తే సినిమాలన్నీ కట్టకట్టుకుని ఒకసారి వచ్చేయడం లేకపోతే కొంత కాలం అసలు సినిమాలే లేకపోవడం షరామామూలే అయిపోయింది. ప్రస్తుతం ఇది కొత్త సినిమాల రిలీజ్ సీజన్ కావడంతో వరుసపెట్టి సినిమాలు దూసుకొచ్చేస్తున్నాయి.

సాధారణంగా శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడి మొదలవుతూ ఉంటుంది. ఎన్నిసినిమాలు బరిలో ఉన్నా సరే సినిమాకు ముందు వచ్చిన టాక్ దీనిలో ప్రధానంగా పరిగణలోకి తీసుకోబడుతుంది. ఆ టాక్ ఆధారంగా మాత్రమే కలెక్షన్లపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అయితే ఈ శుక్రవారం మాత్రం పెద్ద విశేషమే ఉంది. డిసెంబర్ 15న మొత్తం 12 కొత్త సినిమాలు విడుదల అయ్యేందుకు సిద్ధం అయ్యాయి. దీనిలో జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, కుటుంబ కథా చిత్రం, లచ్చి, ఇది మా ప్రేమకథ, సీత రాముని కోసం, మరో దృశ్యం, ప్రేమ పందెం, మామా చందమామ, ఉందా లేదా, తొలి పరిచయం, కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్, పడిపోయా నీ మాయలో సినిమాలు ఉన్నాయి.

దీనిలో ఫెమస్ యాంకర్ రవి హీరోగా నటించిన ఇది మా ప్రేమకథ అనే చిత్రం కూడా ఉంది. రికార్డు స్థాయిలో సినిమాలు రిలీజ్ అవుతున్నా జనాల్లో మాత్రం ఎక్కడా స్పందన అయితే కనిపించడంలేదు. ఎందుకంటే ఇన్ని సినిమాల్లోనూ సరైన సినిమా ఒక్కటి కూడా ప్రేక్షకుల అంచనాల స్థాయిలో లేవు. దీంతో రాబోయే చిత్రాల్లో ఎన్ని బాక్సపీస్ వద్ద విజయం సాధిస్తాయి ..? ఎన్ని బొక్క బోర్లా పడతాయి అనే విషయం మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది.

Leave a comment