ప్రభాస్ పెళ్ళికి ఎందుకు ఆలస్యం..?

ఆరడుగుల ఆజానుబాహుడు, అందగాడు అయిన  ప్ర‌భాస్ బాహుబలి సినిమాతో బాగా పాపులర్ అయిపోయాడు. సినిమాల్లో ఎంత పాపులర్ అయ్యాడో అలాగే ప్రభాస్ పెళ్లి విషయంలోనూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. చాలా కాలంగా ప్రభాస్  పెళ్లి మేట‌ర్  హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్ర‌భాస్ పెళ్లిపై ఇప్ప‌టికే ఎన్నో పుకార్లు వస్తున్నాయి. అయితే  వీటిని మాత్రం ప్రభాస్ కొట్టిపారేస్తూ వస్తున్నాడు.
 ఈ మధ్యకాలంలో  ప్ర‌భాస్.. అనుష్క‌ని వివాహం చేసుకోనున్నాడ‌నే వార్త వైరల్ అయ్యింది. త‌మ పెళ్లి ఎలాంటి అవాంత‌రాలు లేకుండా జ‌ర‌గాల‌ని అనుష్క పూజ‌లు చేసిందని గుసగుసలు కూడా వ‌చ్చాయి. ఇలా ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్న సమయంలో ఇప్పుడు మరో కొత్త వార్త బయలుదేరింది. ఈ డార్లింగ్ పెళ్లి గురించి ఆయన పెదనాన్న కృష్ణంరాజు స్పందించారు. ప్రభాస్ పెళ్లి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అయితే..  పెళ్లి చేసుకుంటాను అని ప్రభాస్ చెప్పిన వెంటనే సంబంధాలు చూడటం ప్రారంభిస్తామని అన్నారు క‌ృష్ణంరాజు.
 వివాహం విషయంలో మాత్రం జాతకాలను తప్పనిసరిగా పట్టించుకుంటామని, ఇద్దరి జాతకం కలిస్తేనే పెళ్లి చేస్తామని ఆయన చెప్పారు. గతంలో సిమెంట్ రంగంలో బాగా పేరు తెచ్చుకున్న రాశి సిమెంట్ చైర్మన్ మానవరాలితో ప్రభాస్ పెళ్లి జరగబోతున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా అనుష్కతో ప్రేమ – పెళ్లి అంటూ కూడా రూమర్స్ వచ్చాయి. కానీ అవన్నీ గాలి వార్తలే అని తేలిపోవడంతో ప్రభాస్ ని చేసుకోబోయే అదృష్టవంతురాలు ఎవరా అనే సందేహంలో పడిపోయారు ప్రభా అభిమానులు.

Leave a comment