Gossipsలోన్ కావాలని వస్తే పడక సుఖం కోరిన మేనేజర్.. ఆమె ఏం...

లోన్ కావాలని వస్తే పడక సుఖం కోరిన మేనేజర్.. ఆమె ఏం చేసిందో తెలుసా..?

రోజు రోజుకి దేశంలోని మహిళలకు బధ్రత లేకుండా పోతుంది. అవసరం అని వచ్చిన మహిళలను తమ అవసరాలకు వాడుకునేలా చూస్తున్నారు. రోజుకి ఇలాంటి సంఘటనలు దేశంలో ఎక్కడో ఒక చోట జరుగుతుండగా లేటెస్ట్ గా బెంగళూరులో ఓ బ్యాంక్ మేనేజర్ తన పై చేసిన అసభ్య ప్రవర్తనకు ఓ మహిళ భలే బుద్ధి చెప్పింది.

కర్ణాటకలోని దేవనగిరి పట్టణానికి చెందిన మహిళ అక్కడ ఉన్న డి.హెచ్.ఎఫ్.ఎల్ లో 2 లక్షల రూపాయల్ లోన్ కు అప్లై చేసింది. ఆమె మీద కన్నేసిన మేనేజర్ దేవయ్య ఆమెను ఇంటికి రమ్మన్నాడు. పక్కా ప్లాన్ ప్రకారం వెళ్లిన మహిళ మేనేజర్ దేవయ్య మాటలన్ని సెల్ ఫోన్ లో బంధించడమే కాకుండా ఆ మేనేజర్ ను అతని ఇంటి బయటే బడిత పూజ చేసింది.

మహిళతో పాటు వచ్చిన వ్యక్తి మేనేజర్ ను కొడుతుంటే వీడియో తీశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తనపై కన్నేసిన మేనేజర్ ను కుళ్లబొడిచిన ఆ మహిళ ధైర్య సాహసాలకు అందరి శభాష్ అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news